పుదీనాతో పొడి దగ్గుకి చెక్ !

     Written by : smtv Desk | Tue, May 30, 2023, 11:53 AM

పుదీనాతో పొడి దగ్గుకి చెక్ !

భారతీయ వంటకాలలో పుదీనాది ప్రత్యేకమైన స్థానం. పూర్వకాలం నుండి కూడా పుదీనా వంటలలో ఉపయోగించే వారు అజీర్ణం వల్ల వచ్చే కడుపునొప్పి తగ్గుతుంది. ఆకలి లేని వారికి అల్లం రసం ఒక చెంచా, పుదీనా రసం ఒక చెంచా కలిపి పరగడుపున తాగితే ఆకలి పెరుగుతుంది. కడుపు నొప్పి ఎక్కువగా వుంటే 1/2 లవంగాల పొడి 1చెంచా పుదీనా రసం కలిపి తాగితే తగ్గుతుంది. పుదీనా ఆకు పొడి, మిరియాల పొడి, జీలకర్ర పొడి, వాము పొడి, సొంటి పొడి సమభాగాలుగా తీసుకుని ఒక చెంచా పొడి ఒక గ్లాసు మజ్జిగలో కలిపి తాగితే కడుపు ఉబ్బరం పోతుంది. పుదీనా పొడి తయారు చేసి నిల్వ ఉంచుకునే బియ్యానికి గాని, పప్పులో గాని, నిలువ ఉంచుకునే గింజలను అయినా కలిపితే పురుగు పట్టదు. పుదీనా ఆకు వాడటం వలన, కూరలు గాని, సాంబార్ గాని మంచి రుచి, మంచి వాసన వస్తాయి.





Untitled Document
Advertisements