జిగట విరేచనాలకు కరివేపాకుతో చెక్ !

     Written by : smtv Desk | Tue, May 30, 2023, 12:12 PM

జిగట విరేచనాలకు కరివేపాకుతో చెక్ !

ప్రతి ఇంటి పెరట్లోనూ ఉండే కరివేపాకులోని ఔషధ గుణాల గురించి దాదాపు అందరికి తెలుసు అయినా కూడా కరివేపాకును ఫుడ్ లో నుండి తీసి పక్కన పడేయడం మనం చూస్తూనే ఉంటాము. అయితే కరివేపాకు కొంతమంది ఇంటి ఆవరణలోనే పెంచుతారు. దీని ఆకులతో కూరలకు, సాంబార్ కు రుచి ఎంతో పెరుగుతుంది. కరివేపుకు కూరల్లో వేయడమే కాకుండా పచ్చి ఆకులను తిన్నా కూడా ఉపయోగం ఉంటుంది. కరివేపాకులో మందు లక్షణాలు ఎన్నో ఉన్నాయి. కరివేపాకు పచ్చడి చేస్తారు. పొడి తయారు చేసుకొని కూడా వాడుతారు. కరివేపాకు హై. బీ.పీ ని అదుపులో వుంచుతుంది.
* 50 గ్రాములు కరివేపాకు దంచి మజ్జిగలో పరగడుపున తాగితే జిగట విరేచనాలు,రక్త విరేచనాలు తగ్గిస్తుంది .
* 50 గ్రాముల కర్వేపాకు మెత్తగా దంచి మజ్జిగలో కలిపి పరగడుపున తాగితే అల్సర్ ను బాగా తగ్గిస్తుంది.
* లేత కరివేపాకు తేనెలో కలిపి తింటే మంచి విరేచనకారి అర్షమొల్లలకు మంచి మందుగా పనిచేస్తుంది.
* కరివేపాకు నీడలో ఆరబెట్టి పొడి చేసి ఉదయం 1 స్పూన్, సాయంకాలం ఒక టీస్పూన్ నీటిలో కలిపి తాగితే  అర్షమొల్లలకు తగ్గుతాయి.
* కరివేపాకు కాయకు నిమ్మరసం కలిపి దంచి, విషం తాగిన వారికి నీటిలో కలిపి తాగితే విషానికి విరుగుడుగా పనిచేస్తుంది.
* పది పదిహేను కరివేపాకులు పరగడుపున నమిలి మింగితే మధుమేహం అదుపులో ఉంటుంది.
అజీర్ణం దూరం చేయును.
* రోజు కరివేపాకు తింటే జ్ఞాపక శక్తి పెరుగుతుంది.
* కరివేపాకును దంచి గజ్జి పై పెడితే గజ్జి తగ్గుతుంది.
* కొబ్బరి నూనెలో కరివేపాకు మరిగించి చల్లారిన తరువాత వడగట్టి రోజు తలకు రాస్తే జుట్టు నల్లగా మారుతుంది.
* కరివేపాకు క్రమం తప్పకుండా ఆహారంలో ఎక్కువగా తింటే వెంట్రుకలు నిలబడతాయి.
* కరివేపాకు పొడి తింటే డిసెంట్రీ, ధైర్య తగ్గుతుంది. సర్వరోగ నివారిణిగా పనిచేస్తుంది.





Untitled Document
Advertisements