హరీశ్ రావుపై మండిపడ్డ విజయశాంతి..

     Written by : smtv Desk | Wed, May 31, 2023, 11:49 AM

హరీశ్ రావుపై మండిపడ్డ విజయశాంతి..

అధికార పక్షం బీఆర్ఎస్ మరియు విపక్షం బీజేపీకి మధ్య ఎప్పుడు చూసిన మాట యుద్ధం జరుగుతూనే ఉంటుంది. ఎప్పటిలానే బీజేపీలో ఎవరూ చేరడం లేదని, ఆ పార్టీ చేరికల కమిటీ ఛైర్మన్ ఈటల రాజేందర్ చేతులెత్తేశారని బీఆర్ఎస్ నేత, మంత్రి హరీశ్ రావు నిన్న వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హరీశ్ రావుపై బీజేపీ నాయకురాలు విజయశాంతి విమర్శలు గుప్పించారు. ఇక చేరకలు లేవంటూ చిట్ చాట్ లో ఈటల చెప్పారని హరీశ్ రావు అంటున్నారని.. బీజేపీని నిరంతరం గెలిపిస్తున్నది ప్రాణమిచ్చే కార్యకర్తల త్యాగాలు, బీజేపీ నమ్మే ప్రజల విశ్వాసాలు, రక్తమిచ్చే హైందవ ధర్మశ్రేణుల పోరాటాలు మాత్రమేనని ఆమె అన్నారు. చేరికల కమిటీ పేరు చెపుతూ, చిట్ చాట్ లను ప్రస్తావిస్తూ మీరు చేస్తున్న బీజేపీ వ్యతిరేక విమర్శల ప్రచారం ఎన్నటికీ నిలవదని అన్నారు. ఈ విషయం హరీశ్ రావు గారికి తెలవంది కాదని ఎద్దేవా చేశారు.

Untitled Document
Advertisements