ఖుషి చిత్రం షూటింగ్ స్పార్ట్ లో విజయ్ దేవరకొండ, సమంత

     Written by : smtv Desk | Wed, May 31, 2023, 11:59 AM

ఖుషి చిత్రం షూటింగ్ స్పార్ట్ లో విజయ్ దేవరకొండ, సమంత

విజయ్ దేవరకొండ మరియు సమంతలకు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన పనిలేదు. అయితే ప్రస్తుతం లైగర్ సినిమా డిజాస్టర్‌‌ తర్వాత ఎలాగైనా మరో మంచి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావాలని యువ హీరో విజయ్‌ దేవరకొండ ఆశిస్తున్నాడు. ఈ క్రమంలో శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న ప్యాన్ ఇండియా చిత్రంపై భారీ ఆశలు పెట్టుకున్నాడు. ఇందులో సమంత హీరోయిన్‌ గా నటిస్తోంది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో సెప్టెంబర్ 1న విడుదల కానున్న ఈ చిత్రం శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటోంది. విజయ్ పుట్టిన రోజు కానుకగా ఇటీవల విడుదల చేసిన ఫస్ట్ సింగిల్‌ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇందులో సామ్, విజయ్‌ కెమిస్ట్రీ బాగా కుదిరిందని ఫ్యాన్స్‌ అంటున్నారు.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కోసం సమంత, విజయ్ టర్కీ వెళ్లారు. అక్కడ అందమైన లొకేషన్లలో ఈ ఇద్దరిపైనా ఓ పాటను చిత్రీకరిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మరోవైపు షూటింగ్ విరామంలో అక్కడి రెస్టారెంట్‌ లో నచ్చిన ఆహారం తింటన్న ఫొటోను విజయ్‌, రిలాక్స్ అవుతున్న ఫొటోను సమంత సోషల్‌ మీడియాలో పంచుకున్నారు. ఈ చిత్రంలో విజయ్ ఆర్మీ ఆఫీసర్‌‌ గా, సమంత కశ్మీర్‌‌ యువతిగా కనిపించనున్నారు.






Untitled Document
Advertisements