మా నాన్న పెళ్ళి విషయంలో ఎవరిని ఫోర్స్ చేయలేదు.. జెమిని గణేషన్ కూతురు

     Written by : smtv Desk | Wed, May 31, 2023, 12:53 PM

మా నాన్న పెళ్ళి విషయంలో ఎవరిని ఫోర్స్ చేయలేదు.. జెమిని గణేషన్ కూతురు

మహానటి సినిమా ద్వారా సావిత్రిగారి జీవితం గురించి ఈ తరం వారికి తెలియజేసే ప్రయత్నం చేసారు మేకర్స్. తొలినాళ్ళలో ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలిగిన సావిత్రి గారు చనిపోవడానికి ముందు ఎన్ని కష్టాలను అనుభవిస్తూ మత్తుకు సైతం బానిసగా మారిపోవడం అనేది ప్రేక్షకుల చేత కంట తడిపెట్టించింది. అయితే ఈ సినిమా ద్వారా
జెమినీ గణేశ్ తో సావిత్రి వివాహం జరిగిన సంగతి.. ఆ తరువాత వాళ్లిద్దరి మధ్య దూరం పెరిగిన మాట అందరికీ తెలిసిందే. తాజాగా సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో జెమినీ గణేశ్ కూతురు కమల గణేశ్ మాట్లాడుతూ .. " మా డాడీ చాలా హ్యాండ్సమ్ గా ఉండేవారు. ముఖ్యంగా ఆయన హెయిర్ స్టైల్ ఎంతో బాగుండేది. పిల్లలందరినీ ఆయన ఎంతో ప్రేమగా చూసుకునేవారు" అని అన్నారు.

"ప్రతిరోజు కూడా మా డాడీని చూడటానికి ఎంతోమంది అమ్మాయిలు వచ్చేవారు. తమని పెళ్లి చేసుకోమని చాలామంది అడిగేవారు. తనకి ఆల్రెడీ పెళ్లి అయిందని ఆయన వారికి నచ్చజెప్పి పంపించేవారు. ఇక ఆ తరువాత ఆయన సావిత్రి గారిని పెళ్లి చేసుకోవడమనేది విధిరాతగానే చెప్పుకోవాలి. అయితే పెళ్లి చేసుకుందామని డాడీ ఎవరినీ ఫోర్స్ చేయలేదు" అని చెప్పారు.

మా డాడీకి మంచి స్టార్ ఇమేజ్ ఉండేది. ఆయనకి అవకాశాలు లేక ఇబ్బంది పడ్డారనడంలో నిజం లేదు. ఆయన గురించి 'మహానటి'లో తప్పుగానే చూపించారు. సావిత్రిగారిని నేను చూశాను .. ఆమె మాతో చాలా చక్కగా మాట్లాడేవారు. మా అమ్మగారు కూడా ఆమెతో చాలా ఆత్మీయంగా ఉండేవారు" అంటూ చెప్పుకొచ్చారు.

Untitled Document
Advertisements