పెళ్లి నాకు నచ్చినప్పుడు చేసుకుంటా.. నా లైఫ్ పాట్నర్ మాత్రం అలా ఉండాలి.. విజయ్ దేవరకొండ

     Written by : smtv Desk | Thu, Aug 31, 2023, 12:16 PM

పెళ్లి నాకు నచ్చినప్పుడు చేసుకుంటా.. నా లైఫ్ పాట్నర్ మాత్రం అలా ఉండాలి.. విజయ్ దేవరకొండ

పెళ్ళిచూపులు సినిమాతో హీరో ఇమేజ్ సొంతం చేసుకుని, అర్జున్ రెడ్డి చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని వరుస విజయాలతో దూసుకెళ్ళిన రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ కొంతకాలంగా వరుస పరాజయాలతో ఉన్నాడు. అయితే లవ్ .. రొమాన్స్ .. మాస్ యాక్షన్ వైపు వెళ్లినా ప్రయోజనం లేకుండా పోయింది. దాంతో ఈ సారి తప్పకుండా హిట్ లిస్ట్ లో చేరిపోవాలని ఆయన 'ఖుషి' సినిమా చేశాడు. శివ నిర్వాణ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా, రేపు థియేటర్లకు రానుంది.
ఈ నేపథ్యంలో ఈ చిత్రం ప్రమోషన్స్ లో విజయ్ దేవరకొండ బిజీగా ఉన్నాడు. రీసెంటుగా ఆయన పోస్ట్ చేసిన ఒక ఫొటో వలన, ఆయన పెళ్లికి సంబంధించిన ప్రచారం ఊపందుకుంది. ఈ విషయంపై ఆయన స్పందిస్తూ, " నా ఇష్టం వచ్చినప్పుడు పెళ్లి చేసుకుంటాను .. అదీ నాకు నచ్చిన అమ్మాయి దొరికితేనే" అని చెప్పాడు.

"పెళ్లి విషయంలో నేను ఎవరి కారణంగా ఒత్తిళ్లకు గురికాను. నా లైఫ్ పార్ట్నర్ గా వచ్చే అమ్మాయి, నా అలవాట్లను .. అభిరుచులను అర్థం చేసుకునేదై ఉండాలి. చాలా చిన్న చిన్న విషయాలుగా అనిపించేవి చూసినప్పుడు కూడా, తనే నాకు గుర్తుకు రావాలి. నా ఇష్టాలను .. తన ఇష్టాలుగా భావించి ఆనందించేదై ఉండాలి. ఇక ఎప్పుడు పెళ్లి చేసుకున్నా .. సింపుల్ గానే చేసుకుంటానని, హంగులూ .. ఆర్భాటాలు ఉండవని అన్నాడు.

Untitled Document
Advertisements