అభిమానులతో తమ చిన్ని కన్నయ్యల పోటోను పంచుకున్న నయన్ దంపతులు

     Written by : smtv Desk | Thu, Sep 07, 2023, 12:49 PM

అభిమానులతో తమ చిన్ని కన్నయ్యల పోటోను పంచుకున్న నయన్ దంపతులు

ఆ చిన్ని కృష్ణుడి జన్మాష్టమి సందర్భంగా లేడీ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న స్టార్ హీరోయిన నయనతార, డైరెక్టర్ విఘ్నేశ్ శివన్ దంపతులు మొదటి సారి తమ కవల పిల్లల (ఉయిర్, ఉలగ్) ఫొటోను విడుదల చేశారు. వారు తమ పిల్లలతో శ్రీకృష్ణ జన్మాష్టమి జరుపుకోవడం ఇదే ప్రథమం. ఇద్దరు పిల్లలకు కృష్ణుడి అలంకారం చేసి, వెనుక నుంచి (ముఖాలు కనిపించకుండా) ఫొటో తీసి, దాన్ని విడుదల చేశారు. అక్టోబర్ తో ఉయిర్, ఉలగ్ లకు ఏడాది పూర్తవుతుంది. దేవుడి మందిరం వద్ద తమ పిల్లలను ఉంచి తీసిన ఫొటోను విఘ్నేశ్ సోషల్ మీడియాలో షేర్ చేశారు.
‘‘మా ఇద్దరు కృష్ణులతో ఎంతో అందమైన కృష్ణ జయంతిని, ఆశీర్వచనాల మధ్య జరుపుకుంటున్నాం. అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. అందరూ తమ కుటుంబాలు, స్నేహితులతో పండుగ జరుపుకుంటున్నారని ఆశిస్తున్నాం’’ అంటూ విఘ్నేశ్ శివన్ ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ పెట్టారు. మరోవైపు నయనతార బాలీవుడ్ ఎంట్రీ అయిన జవాన్ సినిమాకి మంచి స్పందన వస్తుండడం తెలిసిందే.
ప్రస్తుతం నయన్ దంపతులు తమ పిల్లలతో గడిపే సమయాన్ని ఎంతగానో ఆస్వాదిస్తున్నట్టుగా తెలుస్తుంది.

Untitled Document
Advertisements