ప్రేక్షకుల ముందుకు 'రుద్రంకోట‌'.. ప్ర‌పంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్

     Written by : smtv Desk | Thu, Sep 07, 2023, 05:19 PM

ప్రేక్షకుల ముందుకు 'రుద్రంకోట‌'.. ప్ర‌పంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్

ఈ మధ్యకాలంలో సహజసిద్దంగా ఎటువంటి ఆర్బాతాలు లేకుండా తెరకెక్కిన చిత్రాలను ప్రేక్షకులు ఎంతగానో ఆదరిస్తున్నారు. అందుకే నిర్మాతలు సైతం అటువంటి చిత్రాలను నిర్మించడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. తాజాగా సీనియ‌ర్ న‌టి జ‌య‌ల‌లిత స‌మ‌ర్ప‌కులుగా వ్య‌వ‌హరిస్తూ ఓ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్న చిత్రం 'రుద్రంకోట‌'. ఏఆర్ కె విజువ‌ల్స్ ప‌తాకంపై రాము కోన ద‌ర్శ‌క‌త్వంలో అనిల్ ఆర్కా కండ‌వ‌ల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనిల్‌, విభీష, రియా హీరో హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ఇటీవ‌ల సెన్సార్ కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెప్టెంబ‌ర్ 22న స్క్రీన్ మాక్స్ పిక్చ‌ర్స్ సంస్థ ద్వారా వ‌ర‌ల్డ్ వైడ్ గా గ్రాండ్ గా విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది.

ఈ సంద‌ర్భంగా హీరో, నిర్మాత అనిల్ మాట్లాడుతూ.. 'శ్మ‌శాన వాటిక‌లో పెరిగి పెద్దైన ఓ యుకుడి ప్రేమ‌కథా చిత్ర‌మిది. భ‌ద్రాచలం ద‌గ్గ‌ర రుద్రంకోట అనే ఊరి నేప‌థ్యంలో క‌థ న‌డుస్తుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రూ చూపించ‌ని అంశాల‌ను మా చిత్రంలో చూపిస్తున్నాము. ఇందులో అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకునే అంశాలుంటాయి. సీనియ‌ర్ న‌టి జ‌య‌లలిత గారు స‌మ‌ర్ప‌కులుగా వ్య‌వ‌హరిస్తూ ఈ చిత్రంలో ఓ కీల‌క పాత్ర‌లో న‌టించారు. ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కులు కోటి గారు మా చిత్రానికి అద్భుత‌మైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు. సుభాష్ ఆనంద్ అందించిన రెండు పాట‌లు ఇప్ప‌టికే విడుద‌లై ప్ర‌జాద‌ర‌ణ పొందాయి. మా సినిమా న‌చ్చ‌డంతో స్క్రీన్ మాక్స్ పిక్చ‌ర్స్ వారు విడుద‌ల చేయ‌డానికి ముందుకొచ్చారు. సెప్టెంబ‌ర్ 22న వ‌ర‌ల్డ్ వైడ్ గా సినిమాను గ్రాండ్ గా విడుద‌ల చేయ‌నున్నాం' అని తెలిపారు.

Untitled Document
Advertisements