తొలి రోజు రూ.4 కోట్లు కలెక్షన్ రాబట్టిన ‘మిస్ శెట్టి, మిష్టర్ పొలిశెట్టి’

     Written by : smtv Desk | Fri, Sep 08, 2023, 11:55 AM

తొలి రోజు రూ.4 కోట్లు కలెక్షన్ రాబట్టిన ‘మిస్ శెట్టి, మిష్టర్ పొలిశెట్టి’

స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి, యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి జంటగా నటించిన చిత్రం ‘మిస్ శెట్టి, మిష్టర్ పొలిశెట్టి’. గురువారం నాడు భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి రోజు మొత్తం మీద రూ.4 కోట్ల ఆదాయం వచ్చినట్టు శాక్ నిల్క్ అనే వెబ్ సైట్ తెలిపింది. తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేశారు. తెలుగులో థియేటర్లలో తెలుగు ప్రేక్షకుల ఆక్యుపెన్సీ 39 శాతంగా ఉంటే, తమిళంలో 18.16 శాతంగా ఉన్నట్టు వెల్లడించింది. అంటే తెలుగుతో పోలిస్తే తమిళ ప్రజల్లో దీనికి ఆదరణ సగమే ఉన్నట్టు తెలుస్తోంది.

అమెరికాలో తొలి రోజు రూ.2.5 కోట్ల ఆదాయం వసూలైనట్టు స్టూడియో ఫ్లిక్స్ గణాంకాలు చెబుతున్నాయి. షారూక్ ఖాన్ నటించిన జవాన్ కూడా నిన్ననే విడుదల కావడం తెలిసిందే. జవాన్ మొదటి రోజే రూ.75 కోట్లు వసూలు చేసింది. అతిపెద్ద సినిమా విడుదల రోజే మిస్ శెట్టిని తీసుకురావడం కూడా కొంత ప్రభావం పడేలా చేసింది. పి.మహేశ్ బాబు దర్శకత్వంపై వచ్చిన మిస్ శెట్టి మిష్టర్ పొలిశెట్టి సినిమాకు స్పందన మిశ్రమంగా ఉందని ఆడియన్స్ అభిప్రాయాలను పరిశీలిస్తే తెలుస్తోంది. మరి ఈ చిత్రం ఏ మేరకు థియేటర్లలో నిలుస్తుందో చూడాలి.





Untitled Document
Advertisements