'సలార్' స్ట్రీమింగ్ హక్కులను దక్కించుకున్న నెట్ ఫ్లిక్స్..

     Written by : smtv Desk | Wed, Sep 13, 2023, 04:47 PM

'సలార్' స్ట్రీమింగ్ హక్కులను దక్కించుకున్న నెట్ ఫ్లిక్స్..

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. హిట్, ఫ్లాప్ లతో సంబంధం లేకుండా ఆయన తన కెరీర్ లో దూసుకుపోతున్నారు. అలాంటి స్టార్ హీరో ప్రభాస్ నుంచి రానున్న పాన్ ఇండియా సినిమాలలో 'సలార్' ఒకటి. హోంబలే ఫిలిమ్స్ వారు నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రశాంత్ నీల్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం చాలా వరకూ చిత్రీకరణను జరుపుకుంది. ఈ నెల 28వ తేదీన థియేటర్లకు రావలసిన ఈ సినిమా, కొన్ని కారణాల వలన వాయిదా పడింది.
ఈ సినిమా ఓటీటీ హక్కులకు సంబంధించిన వార్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిపోయింది. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కుల కోసం అమెజాన్ ప్రైమ్ వీడియో .. సోనీ లివ్ .. నెట్ ఫ్లిక్స్ వారు పోటీపడినట్టుగా చెబుతున్నారు. చివరికి నెట్ ఫ్లిక్స్ వారు స్ట్రీమింగ్ హక్కులను చేజిక్కించుకున్నట్టుగా తెలుస్తోంది.
ఇందుకు గాను నెట్ ఫ్లిక్స్ వారు 185 కోట్లను చెల్లించినట్టుగా చెబుతున్నారు. ప్రభాస్ కి గల మార్కెట్ .. ప్రశాంత్ నీల్ కి గల ఇమేజ్ .. హోంబలే బ్యానర్ వ్యాల్యూ ఇందుకు కారణమని అంటున్నారు. శ్రుతి హాసన్ కథానాయికగా నటించిన ఈ సినిమాలో, జగపతిబాబు .. పృథ్వీ రాజ్ సుకుమారన్ కీలకమైన పాత్రలను పోషించారు. ఈ సినిమా కొరకు ఆడియన్స్ ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.

Untitled Document
Advertisements