డ్రగ్స్ కేసు వ్యవహారంలో హీరో నవదీప్.. ఆయన ఇంట్లో నార్కోటిక్స్ బ్యూరో సోదాలు

     Written by : smtv Desk | Tue, Sep 19, 2023, 11:15 AM

డ్రగ్స్ కేసు వ్యవహారంలో హీరో నవదీప్..  ఆయన ఇంట్లో నార్కోటిక్స్ బ్యూరో సోదాలు

డ్రగ్స్ వ్యవహారం అనేది సిని ఇండస్ట్రిలో కొత్తేమి కాదు. ఇప్పటికి అనేక సార్లు సిని ప్రముఖులపై కేసులు నమోదైన విషయం తెలిసిందే. అయితే ఈ డ్రగ్స్ వ్యవహారం మరోసారి టాలీవుడ్ ను కుదిపేస్తోంది. మాదాపూర్ డ్రగ్స్ కేసులో హీరో నవదీప్ నిందితుడిగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ కేసులో నవదీన్ ను డ్రగ్స్ వినియోగదారుడిగా పోలీసులు పేర్కొన్నారు. పోలీస్ రెయిడ్స్ లో పట్టుబడిన రామ్ చంద్ అనే వ్యక్తి ఇచ్చిన వాంగ్మూలంలో నవదీప్ తనతో కలిసి డ్రగ్స్ సేవించినట్టు రామ్ చంద్ తెలిపాడు. దీంతో, టీఎస్ నార్కోటిక్స్ బ్యూరో అధికారులు నవదీప్ ను కేసులో నిందితుడిగా చేర్చారు.
ఈ క్రమంలో ఈ నెల 16న హైదరాబాద్ లోని నవదీప్ ఇంట్లో నార్కోటిక్స్ బ్యూరో పోలీసులు సోదాలు నిర్వహించారు. ఆ సమయంలో నవదీప్ ఇంట్లో లేడని సమాచారం. మరోవైపు తనను అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని టీఎస్ హైకోర్టును నవదీప్ ఆశ్రయించిన సంగతి తెలిసిందే. నవదీప్ విన్నపం పట్ల సానుకూలంగా స్పందించిన హైకోర్టు.. ఈరోజు వరకు నవదీప్ ను అరెస్ట్ చేయవద్దని ఆదేశించింది. ఈ నేపథ్యంలో, నేడు హైకోర్టులో నవదీప్ కు సంబంధించి నార్కోటిక్ బ్యూరో కౌంటర్ దాఖలు చేయనుంది.
గత నెల 31న మాదాపూర్ లోని ఫ్రెష్ లివింగ్ అపార్ట్ మెంట్స్ లో డ్రగ్స్ పార్టీ జరిగింది. ఈ పార్టీపై దాడి చేసిన నార్కోటిక్స్ బ్యూరో 13 మందిని అరెస్ట్ చేసింది. నవదీప్ ను కూడా అరెస్ట్ చేసి విచారించాలనే యోచనలో నార్యోటిక్స్ బ్యూరో అధికారులు ఉన్నారు. మరి నార్కోటిక్ బ్యూరో చేయబోయే కౌంటర్ దాఖలు పై కోర్టు ఏవిధంగా స్పందిస్తుందో చూడాలి.

Untitled Document
Advertisements