'చంద్రముఖి 2' ప్రీ రిలీజ్.. ఎప్పుడంటే?

     Written by : smtv Desk | Sat, Sep 23, 2023, 12:28 PM

'చంద్రముఖి 2' ప్రీ రిలీజ్.. ఎప్పుడంటే?

చాల సంవత్సరాల క్రితం వచ్చిన చంద్రముఖి చిత్రం ఇప్పటికి ప్రేక్షకులు ఇంకా మరిచిపోనేలేదు. రజనీకాంత్.. నయనతార.. ప్రభు.. జ్యోతిక ప్రధానమైన పాత్రలను పోషించిన చిత్రం కథాకథనాల పరంగా .. వసూళ్ల పరంగా సంచలనం సృష్టించింది. అలాంటి ఆ సినిమాకి సీక్వెల్ గా థియేటర్లకు రావడానికి 'చంద్రముఖి 2' సిద్ధమవుతోంది.
ఈ నెల 28వ తేదీన ఈ సినిమా భారీ స్థాయిలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంటుకి సన్నాహాలు జరుగుతున్నాయి. రేపు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంటును హైదరాబాదు - ఫిల్మ్ నగర్ లోని జేఆర్సీ కన్వెన్షన్ లో నిర్వహించనున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి.
రేపు సాయంత్రం 6 గంటల నుంచి ఈ వేడుక మొదలుకానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ అధికారిక పోస్టర్ ను రిలీజ్ చేశారు. కంగనా - లారెన్స్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమాలో, వడివేలు .. రాధిక .. లక్ష్మి మీనన్ .. మహిమ నంబియార్ .. శృతి డాంగే ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు.

Untitled Document
Advertisements