'చంద్రముఖి-2' సినిమా విడుదల నేపధ్యంలో రజనీకాంత్ ని కలిసిన రాఘవ లారెన్స్

     Written by : smtv Desk | Tue, Sep 26, 2023, 03:56 PM

'చంద్రముఖి-2' సినిమా విడుదల నేపధ్యంలో రజనీకాంత్ ని కలిసిన రాఘవ లారెన్స్

హీరో, దర్శకుడు, కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ గురించి ప్రత్యేకించి పరిచయం అక్కర్లేదు. ఆయన తన నటనతోనే కాకుండా అతను చేస్తున్న సేవా కార్యక్రమాల ద్వారా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. తాజాగా రాఘవ లారెన్స్
తమిళ సూపర్ స్టార్, తలైవర్ రజనీకాంత్ ను కలిశారు. చెన్నైలోని రజనీ నివాసానికి వెళ్లిన లారెన్స్.. ఆయన కాళ్లు మొక్కి, ఆశీర్వాదం తీసుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో లారెన్స్ పంచుకున్నారు. తన గురువు తలైవా రజనీకాంత్ సార్ ను కలిశానని ఎక్స్ వేదికగా లారెన్స్ తెలిపారు. 'జైలర్' సినిమా సూపర్ హిట్ అయినందుకు అభినందనలు తెలిపానని చెప్పారు. అలాగే తన 'చంద్రముఖి-2' సినిమా విడుదల నేపథ్యంలో సార్ ఆశీర్వాదం తీసుకున్నానని.. చాలా సంతోషంగా ఉందని అన్నారు. రజనీ సార్ చాలా గొప్ప వ్యక్తి అని చెప్పారు. 'గురువే శరణం' అని అన్నారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మనస్తత్వం రాఘవది అని ఈ సంఘటన ద్వారా మరోసారి రుజువైంది.





Untitled Document
Advertisements