ఆ వార్తల్లో నిజం లేదు.. తప్పుడు కథనాలు.. నిత్యా మీనన్

     Written by : smtv Desk | Wed, Sep 27, 2023, 01:08 PM

ఆ వార్తల్లో నిజం లేదు.. తప్పుడు కథనాలు..  నిత్యా మీనన్

అలామొదలైంది, ఇష్క వంటి చిత్రాలతో తెలుగు తెరపై సందడి చేసి యువహృదయాలను కొల్లగొట్టిన దక్షిణాది భామ నిత్యా మీనన్. ఈ అమ్మది హైట్ తక్కువే అయిన క్రేజ్ మాత్రం మాములుగా ఉండదు. అలాంటి బ్యూటీని ఓ తమిళ హీరో రేప్ చేసాడు అనే కధనాలు వెలువడ్డాయి. అయితే ఈ అమ్మడు తాజాగా తమిళ హీరో తనను వేధింపులకు గురిచేశాడంటూ వస్తున్న కథనాలను కొట్టి పారేసింది. ఓ సినిమా చిత్రీకరణ సమయంలో తమిళ్ హీరో వేధించినట్టు వచ్చిన కథనాలపై స్పందించింది. ‘‘తెలుగు పరిశ్రమలో నేను ఎప్పుడూ ఇబ్బందులు ఎదుర్కోలేదు. కానీ, తమిళ పరిశ్రమలో ఎన్నో ఇబ్బందులు పడ్డాను. ఓ సినిమా షూటింగ్ లో భాగంగా తమిళ హీరో నన్ను వేధింపులకు గురి చేశాడు’’అంటూ నిత్యా మీనన్ చెప్పినట్టుగా కథనాలు వెలుగులోకి వచ్చాయి.
ఈ వార్తలకు సంబంధించి ఓ స్క్రీన్ షాట్ ఫొటోను షేర్ చేస్తూ.. ‘‘తప్పుడు కథనాలు ప్రసారం చేయవద్దంటూ నిత్యా మీనన్ కోరింది. ‘‘జర్నలిజంలో కొన్ని వర్గాలు ఈ స్థాయికి దిగజరాడం ఎంతో బాధను కలిగిస్తోంది. దీనికంటే మెరుగ్గా ఉండాలని కోరుతున్నాను’’అంటూ పోస్ట్ పెట్టింది. ‘‘ఇది పూర్తిగా అవాస్తవం. నేను ఇంటర్వ్యూ ఇవ్వలేదు. ఈ వదంతుల వ్యాప్తిని ఎవరు మొదలు పెట్టారో చెప్పండి. కేవలం క్లిక్ ల కోసం ఈ తరహా అవాస్తవాలను ప్రచారం చేసే వారిని బాధ్యులను చేయాలి’’అని నిత్య మీనన్ తన ఒపినియన్ షేర్ చేసింది.


Untitled Document
Advertisements