సోషల్ మీడియాలో రాజమౌళి విడుదల చేసిన శివరాజ్ కుమార్ 'ఘోస్ట్' ట్రైలర్..

     Written by : smtv Desk | Mon, Oct 02, 2023, 03:35 PM

సోషల్ మీడియాలో రాజమౌళి విడుదల చేసిన శివరాజ్ కుమార్ 'ఘోస్ట్' ట్రైలర్..

శివరాజ్ కుమార్ కథానాయకుడిగా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్న సినిమా 'ఘోస్ట్'. డైరెక్టర్ శ్రీని 'ఘోస్ట్' మూవీని యాక్షన్ ఫీస్ట్ గా తెరకెక్కిస్తున్నారు. ప్రముఖ రాజకీయనాయకులు, సినీ ప్రొడ్యుసర్ సందేశ్ నాగరాజ్ తన సందేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఘోస్ట్ సినిమాని ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. అక్టోబర్ 19న దసరా కానుకగా కన్నడ, తెలుగు, తమిళ, హిందీ, మలయాళం భాషల్లో భారీ స్థాయిలో రిలీజ్ కి సిద్ధమవుతోంది.
అక్టోబర్ 1న చిత్ర బృందం 'ఘోస్ట్' చిత్రం ట్రైలర్ ను రిలీజ్ చేసింది. దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి తెలుగు ట్రైలర్ ను తన సోషల్ మీడియా మాధ్యమాల్లో విడుదల చేశారు. ట్రైలర్ ఆద్యంతం హై ఓల్టేజ్ యాక్షన్ తో రోమాంఛితంగా ఉంది. ట్రైలర్ ఇంతక ముందెన్నడూ చూడని యాక్షన్ తో ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకెళుతుంది. శివ రాజ్ కుమార్ హైలైట్ స్క్రీన్ ప్రెజెన్స్ కి తోడు దర్శకుడు శ్రీని తనదైన విజన్ తో హీరోయిజం నీ నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళారు.
"నేను నార్మల్ గా ఎవరి జోలికి వెళ్ళను ఒడిపోతాననే భయం కాదు .. నేను వెళితే రణరంగం మారణహోమంగా మారుతుంది.." అనే డైలాగ్ శివ రాజ్ కుమార్ పాత్ర ఎంత పవర్ఫుల్ గా తెరకెక్కించారో చెబుతోంది. సంగీత దర్శకుడు అర్జున్ జన్య అందించిన సంగీతం యాక్షన్ సీన్స్ ను మరో స్థాయికి తీసుకెళ్లింది. వింటేజ్ శివన్న యంగ్ గా కనబడే షాట్స్ ఫ్యాన్స్ కి ఫీస్ట్ గా ఉండనున్నాయి. ట్రైలర్ ఘోస్ట్ మీద ఉన్న అంచనాలను తారస్థాయికి తీసుకెళ్లింది.
https://youtu.be/u2w_Xv9vyl0?si=ufaTl_rP2MkngfQT





Untitled Document
Advertisements