విడుదలైన రష్మిక, రణబీర్ ల 'యానిమల్' పోస్టర్.. ఆకాశంలో లిప్ లాక్

     Written by : smtv Desk | Tue, Oct 10, 2023, 02:19 PM

విడుదలైన రష్మిక, రణబీర్ ల 'యానిమల్' పోస్టర్.. ఆకాశంలో లిప్ లాక్

గీతాగోవిందం సినిమాతో కుర్ర హృదయాలను కొల్లగొట్టి అందరిని ఆమె అందంతో మాయలో పడేసింది.ప్రస్తుతం యూత్ లో ఆమె ఫాలోయింగ్, క్రేజ్ మాములుగా లేవు. టాలీవుడ్ మాత్రమె కాదు బాలీవుడ్ లోనూ రష్మిక క్రేజ్ మామూలుగా లేదు. 'పుష్ప' చిత్రంతో ఉత్తరాది ప్రేక్షకులను దగ్గరైన రష్మిక.. బాలీవుడ్ లో సెటిల్ అవ్వడంపై ఫుల్ ఫోకస్ పెట్టింది. ఇప్పటికే ఆమెకు బాలీవుడ్ లో ఆఫర్లు కూడా బాగానే ఉన్నాయి. మరోవైపు బాలీవుడ్ కు తగ్గట్టుగానే రష్మిక అన్నిటికీ ఓకే చెపుతోంది. రొమాంటిక్ సీన్లలో నటించేందుకు వెనుకాడటం లేదు.
బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ తో రష్మిక కలిసి నటించిన 'యానిమల్' పోస్టర్ ను చిత్ర యూనిట్ కాసేపటి క్రితం రిలీజ్ చేసింది. ఆకాశంలో విమానంలో ప్రయాణిస్తున్న సమయంలో రష్మిక, రణబీర్ కపూర్ ల అధరచుంబన సన్నివేశాన్ని పోస్టర్ గా వదిలారు. సోషల్ మీడియాలో ఈ పోస్టర్ వైరల్ అవుతోంది. రేపు ఈ చిత్రానికి చెందిన ఫస్ట్ సాంగ్ ను విడుదల చేయబోతున్నట్టు యూనిట్ ప్రకటించింది.

ఈ సినిమాకి 'అర్జున్ రెడ్డి' డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించాడు. డిసెంబర్ 1న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. హిందీ, తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది.Untitled Document
Advertisements