రేపు సాయంత్రం 6 గంటలకు 'టైగర్ నాగేశ్వరరావు' ప్రీ రిలీజ్ ఈవెంట్.. ఎక్కడంటే?

     Written by : smtv Desk | Sat, Oct 14, 2023, 04:02 PM

రేపు సాయంత్రం 6 గంటలకు 'టైగర్ నాగేశ్వరరావు' ప్రీ రిలీజ్ ఈవెంట్.. ఎక్కడంటే?

మాస్ మహారాజా రవితేజకు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. తాజాగా రవితేజ హీరోగా 'టైగర్ నాగేశ్వరరావు' సినిమా రూపొందింది. వంశీ డైరెక్ఈషన్ లో వస్తున్న ఈ చిత్రానికి, అభిషేక్ అగర్వాల్ ప్రొడ్యుసర్ గా వ్యవహరించాడు. స్టూవర్టుపురం గజదొంగ అయిన టైగర్ నాగేశ్వరరావు జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. డిఫరెంట్ లుక్ తో రవితేజ కనిపించనున్నాడు. దసరా పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని, ఈ సినిమాను ఈ నెల 20వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 15వ తేదీన ప్రీ రిలీజ్ ఈవెంటును నిర్వహిస్తున్నారు. ఈ వేడుకకు కిషన్ రెడ్డినీ .. విజయేంద్రప్రసాద్ ను ముఖ్య అతిథులుగా ఆహ్వానించారు.ఈ ప్రీ రిలీజ్ ఈ వెంటుకు సంబంధించిన పోస్టర్ ను కొంతసేపటి క్రితం రిలీజ్ చేశారు. రేపు సాయంత్రం 6 గంటల నుంచి హైదరాబాద్ 'శిల్పకళావేదిక'లో ఈ వేడుక మొదలుకానుంది. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాతో, నుపుర్ సనన్ హీరోయిన్ గా పరిచయమవుతోంది.


Untitled Document
Advertisements