'టైగర్ నాగేశ్వరరావు' ప్రీ రిలీజ్ లో రేణుదేశాయ్ కొడుకు గురించి విజయేంద్ర ప్రసాద్ ఆసక్తికర వాఖ్యలు

     Written by : smtv Desk | Mon, Oct 16, 2023, 09:22 AM

 'టైగర్ నాగేశ్వరరావు' ప్రీ రిలీజ్ లో రేణుదేశాయ్ కొడుకు గురించి విజయేంద్ర ప్రసాద్ ఆసక్తికర వాఖ్యలు

మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా డైరెక్టర్ వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'టైగర్ నాగేశ్వరరావు' . ఈ నెల 20వ తేదీన ఈ చిత్రం థియేటర్లకు రానుంది. సినిమా రిలీజ్ నేపథ్యంలో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంటుకు విజయేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఆయన మాట్లాడుతూ .. "గతంలో మణిరత్నం గారి 'నాయకుడు' వంటి సినిమా చూస్తూ, ఇలాంటి సినిమాలు తెలుగులో ఎప్పుడు వస్తాయా అనుకునేవాడిని .. అలాంటి సినిమా ఇప్పుడు వచ్చింది" అంటూ ఆడిటోరియంను హూషారెత్తించారు.
'పుష్ప' తరువాత ట్రైలర్ తోనే నన్ను కథలోకి .. ఆ కాలంలో తీసుకెళ్లిన సినిమా ఇది. ట్రైలర్ చూడగానే దర్శకుడు వంశీకి ఫోన్ చేసి అభినందించాను. రేణు దేశాయ్ గారు తెలుగు సినిమాలు చేయకపోయినా, తెలుగు ప్రేక్షకులకు దగ్గరగానే ఉన్నారు. ఆమె వాళ్ల అబ్బాయిని హీరోగా చేయాలి .. సినిమాలో అతని తల్లి పాత్రను ఆమెనే చేయాలనేదే నా మాట" అనడంతో ఒక్కసారిగా అక్కడ సందడి పెరిగిపోయింది.
"రవితేజ టాలెంట్ గురించి నాకు తెలుసు. భారతదేశమంతా ఆయన తన కీర్తి పతాకాన్ని ఎగరేయాలని కోరుకుంటున్నాను. వచ్చేది దసరా .. దుర్గమ్మవారికి ఎదురుగా ఎవరూ నిలబడలేరు .. ఆ తల్లి వాహనమైన 'టైగర్' ముందు కూడా ఎవరూ ఎదురుగా నిలబడలేరు. ఈ దసరా నీదే .. నీదే" అని అన్నారు. విజయేంద్ర ప్రసాద్ మాటలతో ఈ సినిమా పట్ల ప్రేక్షకులలో మరింత అంచనాలు పెరిగిపోయాయి. సినిమా రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Untitled Document
Advertisements