‘ఛత్రపతి’ రీరిలీజ్.. డార్లింగ్ పుట్టినరోజు కానుకగా 23న థియేటర్లలో సందడి

     Written by : smtv Desk | Wed, Oct 18, 2023, 11:48 AM

‘ఛత్రపతి’ రీరిలీజ్.. డార్లింగ్ పుట్టినరోజు కానుకగా 23న థియేటర్లలో సందడి

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అభిమానులంతా డార్లింగ్ అని ముద్దుగా పిలుచుకునే ప్రభాస్ సినిమా అంటే ప్రేక్షకులకు పునకాలే మరి. అయితే, ప్రభాస్, శ్రియా శరణ్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ ‘ఛత్రపతి’ మరో సారి ప్రేక్షకుల ముందుకు వస్తోంది. దీన్ని ఈ నెల 23న దేశవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. రాజమౌళి తీసిన ఈ సినిమా 2005లో విడుదలై సూపర్ హిట్ కావడం ప్రేక్షకులకు గుర్తుండే ఉంటుంది. 18 ఏళ్ల తర్వాత తిరిగి ఈ సినిమాను మరోసారి విడుదల చేయడానికి ఏర్పాట్లు చేశారు. ప్రభాస్ కు ఈ సినిమాతో మంచి గుర్తింపు రావడం తెలిసిందే.
ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా ఈ నెల 23న సినిమా విడుదలకు రంగం సిద్ధం చేశారు. దీనిని 4కే వెర్షన్ లో తీసుకొస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి బుకింగ్ లను కూడా త్వరలోనే ప్రారంభించనున్నారు. భాను ప్రియ, ప్రదీప్ రావత్, కోట శ్రీనివాసరావు, జైప్రకాష్ రెడ్డి ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషించారు. ఎంఎం కీరవాణి సంగీతం అందించగా, బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మాతగా ఉన్నారు.

Untitled Document
Advertisements