కూతురితో ఇటలీ బయల్దేరిన రామ్ చరణ్ దంపతులు.. క్లీంకారతో తొలి విదేశీ ట్రిప్ ఇదే

     Written by : smtv Desk | Wed, Oct 18, 2023, 01:32 PM

కూతురితో ఇటలీ బయల్దేరిన రామ్ చరణ్ దంపతులు.. క్లీంకారతో తొలి విదేశీ ట్రిప్ ఇదే

పాన్ ఇండియా స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం కూతురు క్లింకారతో తండ్రిగా సమయం గడిపేందుకు సిద్దమయ్యారు.అందుకొరకు భార్య, కూతురుతో సహా ఫారిన్ ట్రిప్ కు బయల్దేరాడు. బిజీ షూటింగ్ షెడ్యూల్ లో కూడా కుటుంబం కోసం కాస్త సమయాన్ని తీసుకుని ఇటలీకి పయనమయ్యాడు. ఈ ట్రిప్ కు ఎంతో ప్రత్యేకత ఉంది. ఇది తన ముద్దుల తనయ క్లీంకారకు తొలి ఫారిన్ ట్రిప్ కావడం గమనార్హం. విమానాశ్రయంలో వారు వెళ్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రామ్ చరణ్ చేతుల్లో వారి పెట్ డాగ్ రైమ్, ఉపాసన ఒడిలో క్లీంకార ఉన్నారు. ఫొటోల్లో చరణ్, ఉపాసన ఇద్దరూ క్యాజువల్ లుక్ లో ఉన్నారు. అయితే తమ కూతురు ముఖాన్ని మాత్రం కెమెరాలకు ఉపాసన చూపించలేదు. ఫ్యాన్స్ తమ అభిమాన హీరో ముద్దుల కూతురుని ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఆరాటపడుతున్నారు.

Untitled Document
Advertisements