నెట్ ఫ్లిక్స్ లో నయనతార క్రైమ్ థ్రిల్లర్ 'ఇరైవన్' !

     Written by : smtv Desk | Wed, Oct 25, 2023, 11:35 AM

నెట్ ఫ్లిక్స్ లో నయనతార క్రైమ్ థ్రిల్లర్ 'ఇరైవన్' !

లేడీ సూపర్ స్టార్ నయనతార గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. నయన్ కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ మాములుగా ఉండదు. నయన్ తాజా చిత్రం 'ఇరైవన్' తమిళంలో సెప్టెంబర్ 28వ తేదీన థియేటర్లకు వచ్చింది. నయనతార - జయం రవి ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ చిత్రం యొక్క కథ ఒక సైకో చేసే వరుస హత్యల నేపథ్యంలో నడుస్తుంది. ఆ సైకోను పట్టుకునే పోలీస్ ఆఫీసర్ గా జయం రవి .. ఆయన ప్రియురాలిగా నయనతార కనిపిస్తారు.
తమిళంలో బాగానే ఆడిన ఈ సినిమా, 'గాడ్' టైటిల్ తో తెలుగులో ఈ నెల 13వ తేదీన విడుదలైంది. అయితే తెలుగు ప్రేక్షకుల నుంచి ఈ సినిమా ఆశించిన స్థాయి ఆదరణను పొందలేకపోయింది. దర్శకుడు అహ్మద్ ట్రీట్మెంట్ .. స్లో నేరేషన్ కారణంగా ఈ కంటెంట్ కనెక్ట్ కాలేదనే టాక్ వినిపించింది.
అలాంటి ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను నెట్ ఫ్లిక్స్ వారు సొంతం చేసుకున్నారు. ఈ నెల 26వ తేదీ నుంచి ఈ సినిమాను ఐదు భాషల్లో స్ట్రీమింగ్ చేస్తున్నారు. అందుకు సంబంధించిన పోస్టర్ ను కూడా వదిలారు. నయనతార సినిమాలకి ఓటీటీ వైపు నుంచి మంచి రెస్పాన్స్ ఉంటుంది. మరి సినిమా విషయంలో ఎంజరుగుతుందో చూడాలి.

Untitled Document
Advertisements