సినిమాల నుండి కొంత కాలం బ్రేక్ తీసుకుంటున్న రణబీర్ కపూర్

     Written by : smtv Desk | Wed, Oct 25, 2023, 12:24 PM

సినిమాల నుండి కొంత కాలం బ్రేక్ తీసుకుంటున్న  రణబీర్ కపూర్

బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ తాజాగా తన అభిమానులతో ముచ్చటించాడు. ఈ సందర్భంలో తాను కొద్ది కాలంపాటు సినిమాల నుండి బ్రేక్ తీసుకుంటున్న విషయం వెల్లడించాడు. తన కూతురు రాహాతో గడిపేందుకు ఆరు నెలల పాటు సినిమాలకు దూరంగా ఉండాలని రణబీర్ కపూర్ నిర్ణయించుకున్నాడు. జూమ్ ద్వారా తన అభిమానులతో ముచ్చటించిన రణబీర్ యానిమల్ సినిమా తర్వాత తాను ఏ సినిమాకు కమిట్ మెంట్ ఇవ్వలేదన్నాడు.
రణబీర్ కపూర్, అలియా భట్ 2022 ఏప్రిల్ లో వివాహం చేసుకోగా, వీరికి అదే ఏడాది నవంబర్ 6న సంతానం కలిగింది. వచ్చే నెలలోనే రాహా మొదటి పుట్టిన రోజు జరుపుకోనుంది. సినిమా షూటింగ్ లతో బిజీగా ఉన్నందున తన కుమార్తెతో ఇప్పటి వరకు పెద్దగా సమయం గడపలేకపోయినట్టు రణబీర్ వెల్లడించాడు. అందుకే ఇప్పుడు 5-6 నెలల పాటు సినిమా షూటింగ్ లకు దూరంగా ఉండి, కుమార్తెతో సమయం వెచ్చించాలని నిర్ణయించుకున్నట్టు రణబీర్ కపూర్ తెలిపాడు.

తాను సరైన సమయంలో బ్రేక్ తీసుకున్నట్టు చెప్పాడు. రాహ ఇప్పుడు చాలా బాగా భావ వ్యక్తీకరణ చేస్తున్నట్టు పేర్కొన్నాడు. బాగా గుర్తు పడుతోందని, ఎంతో ప్రేమ కురిపిస్తోందన్నాడు. ప, మ అనే పదాలను పలికేందుకు ప్రయత్నిస్తోందని, ఆమెతో గడపడం ఎంతో సంతోషంగా ఉన్నట్టు రణబీర్ కపూర్ వివరించాడు. మరోవైపు అలియా భట్ సినిమాలతో బిజీగా గడుపుతోంది. దీంతో రాహాకు ఇద్దరూ దూరం కాకూడదనే రణబీర్ ఇలా చేసి ఉండొచ్చని ఫ్యాన్స్ భావిస్తున్నారు. మరోవైపు రణబీర్ నటించిన యానిమల్ చిత్రం త్వరలో రిలీజ్ కానుంది.

Untitled Document
Advertisements