పాపం రష్మిక.. సోషల్ మీడియాలో మరో డీప్ ఫేక్ వీడియో వైరల్

     Written by : smtv Desk | Fri, Nov 10, 2023, 12:45 PM

పాపం రష్మిక.. సోషల్ మీడియాలో మరో డీప్ ఫేక్ వీడియో వైరల్

సాంకేతికంగా ఎంతో పురోగతి సాధిస్తూ కష్టమైన పనులను సైతం సులభతరం చేస్తూ అభివృద్ధి వైపు శరవేగంగా దుసుకుపోతున్నాము. అయితే మనం రూపొందించిన టెక్నాలజీ కారణంగానే మనకి ముప్పు వాటిల్లుతుంది. తాజాగా అందాలనటి రష్మిక మందన్న మరోసారి డీప్ ఫేక్ వీడియో బాధితురాలు అయ్యారు. ఇటీవల రష్మిక మందన్న డీప్ ఫేక్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆ వీడియో గురించి మరువకముందే రష్మికపై మరో డీప్ ఫేక్ వీడియో తెరపైకి వచ్చింది. తాజా వీడియోలో రష్మిక జిమ్ సూట్ వేసుకుని డ్యాన్స్ చేస్తున్నట్టుగా ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాయంతో కచ్చితత్వంతో కూడిన ఫేక్ వీడియోలను రూపొందించే వెసులుబాటు ఉంది. ఒరిజినల్ వీడియో ఉంటే తప్ప, ఫేక్ వీడియోనే నిజమైన వీడియో అని భ్రమపడేలా ఏఐ డీప్ ఫేక్ వీడియోలు ఉంటాయి. రష్మికపై మరో డీఫ్ ఫేక్ వీడియో రావడం పట్ల సోషల్ మీడియాలో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. సెలబ్రిటీల పరిస్థితే ఇలా ఉంటే సామాన్యుల పరిస్థితి ఇంకెలా ఉంటుంది. ముఖ్యంగా ఆడపిల్లల పరిస్థితి ఎలా ఉంటుంది అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.





Untitled Document
Advertisements