2 ఏళ్లలో 60 కిలోలు తగ్గిన 46 సంవత్సరాల వ్యాపారవేత.. కేవలం ఈ రెండు మార్పులే చాలట!

     Written by : smtv Desk | Sat, Nov 18, 2023, 12:33 PM

2 ఏళ్లలో 60 కిలోలు తగ్గిన 46 సంవత్సరాల వ్యాపారవేత.. కేవలం ఈ రెండు మార్పులే చాలట!

​హర్యానాలోని రెవారీకి చెందిన 5.9 అడుగులఎత్తు, 46 సంవత్సరాల వయసు గల ఆశిష్ సచ్‌దేవా అనే వ్యాపారవేత్త.. ఒకప్పుడు దాదాపు 140 కిలోల బరువుండే అతను 2.5 సంవత్సరాలలో 60.9 కిలోల బరువు తగ్గగలిగాడు.
నలభై ఆరేళ్ల ఆశిష్ సచ్‌దేవా, ఒకప్పుడు దాదాపు 140 కిలోల బరువు ఉండేవారు. అతని వెయిట్‌ లాస్‌ జర్నీ స్టోరీని Etimes లైఫ్‌స్టైల్‌తో పంచుకున్నాడు. అతని వెయిట్ లాస్ జర్నీ అతని మాటల్లోనే తెలుసుకుందాం..
" నేను గతంలో 140 కిలోల బరువు ఉండేవాడి. టెక్నికల్‌గా నేను ఊబకాయంతో ఉన్నాను. నా సైజ్‌ డ్రెసెస్‌ దొరకడం నాకు చాలా కష్టమయ్యేది. నా ప్లస్ ప్లస్ సైజు దుస్తులు కొనడానికి, జీన్స్‌ కుట్టుంచుకోవడానికి.. దిల్లీ వరకు వెళ్లేవాడిని. నా ఓవర్‌ వెయిట్‌ కారణంగా.. హైపర్‌టెన్షన్‌, కీళ్లనొప్పు, జ్ఞాపకశక్తి కోల్పోవడం వంటి సమస్యలతో ఇబ్బంది పడేవాడిని.
టర్నింగ్‌ పాయింట్‌..
“ఆర్ట్ ఆఫ్ లివింగ్ ద్వారా నేను అధ్యాత్మికతకు బాగా కనెక్ట్‌ అయ్యా. ఆధ్యాత్మిక ఆలోచనలు.. నా ప్రపంచ దృష్టికోణం, విలువలు, జీవిత విధానాన్ని మార్చాయి. నేను ధ్యానం చేయడం ప్రారంభించాను, నా బలహీనతలను కనుగొన్నాను. ధ్యానం నా గురించి చాలా విషయాలను.. నేను తెలుసుకునేలా చేసింది. నా వెయిట్‌ లాస్‌ జర్నీకి మార్గం చూపించింది.
"నేను బరువు తగ్గడానికి ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ.. నా వెయిట్‌ లాస్‌ జర్నీ అంత సులభం కాలేదు. నేను బరువు తగ్గడానికి, ఎంతో కష్టపడినా.. 10 నెలల్లో 1 కిలో బరువు మాత్రమే తగ్గాను. ఇది నాకు పెద్ద సవాలుగా మారింది. అయినా నేను నా లక్ష్యాన్ని విడిచిపెట్టలేదు. కష్ట సమయాలు మానవ అనుభవంలో ఒక భాగమని గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం. చివరికి, నా ప్రయత్నాలు విజయం సాధించాయి, మంచి రిజల్ట్‌ కూడా తీసుకొచ్చాయి."
నేను దృష్టి పెట్టిన రెండు ముఖ్యమైన అంశాలు..
1. రాత్రిపూట త్వరగా నిద్రపోవడం, తెల్లవారుజామునే నిద్ర లేవడం
2. జంక్‌ ఫుడ్‌, చక్కెర పదార్థాలకు దూరంగా ఉన్నాను.
ఎలాంటి డైట్‌ తీసుకున్నారు..?
ఎలాంటి డైట్‌ తీసుకున్నారు..?
బ్రేక్‌పాస్ట్‌ : 4 ఎగ్‌ వైట్స్‌, 2 గుడ్లు, ఓట్స్/పోహా/గ్రీన్ డాల్ చీలా
భోజనం : సలాడ్ + పండ్లు + 1 కప్పు సీజనల్‌ కూరగాయలు + 1 కప్పు పెరుగు
నా డిన్నర్: 4 గుడ్డులోని తెల్లసొన +2 మొత్తం గుడ్లు + 2 మల్టీగ్రెయిన్ రోటీస్‌తో పాటు 1 గిన్నె వెజ్జీలు/ పప్పు + సలాడ్‌లు (సాయంత్రం 7:00)
వ్యాయామానికి ముందు : రైస్ కేక్, పీనట్‌ బటర్‌
వ్యాయామం తర్వాత : ప్రోటీన్ షేక్ + నట్స్
చీట్‌ మీల్‌ : ఏదైనా (చక్కెర తప్ప)​

*వారంలో మూడు 3-4 రోజుల స్ట్రెంగ్త్‌ ట్రైనింగ్‌, 1-2 రోజుల కార్డియోవాస్కులర్ వ్యాయామం (సైక్లింగ్ & రన్నింగ్), స్ట్రెచింగ్/యోగా కోసం 1 రోజు
* క్రమం తప్పకుండా వ్యాయామం చేయడమే కాకుండా, మన శరీరానికి విశ్రాంతి, కోలుకోవడం, ప్రశాంతమైన నిద్ర చాలా అవసరం అని సచ్‌దేవా అన్నారు.
* జీవితంలో ప్రతిదాని పట్ల సానుకూల దృక్పథాన్ని పెంపొందించడం ద్వారా నేను ప్రేరణ పొందుతాను. దృఢ సంకల్పం ఉన్నప్పుడే అన్నీ సాధించగలమని నేను నమ్ముతాను. మంచి శ్రవణ నైపుణ్యాలు ఉన్నాయి, నా చుట్టూ ఉన్న ప్రతి వ్యక్తి సానుకూల అంశాలను తెలుసుకోవడానికి నేను ప్రయత్నిస్తాను.

Untitled Document
Advertisements