అందాల నటుడు శోభన్ బాబు గురించి దర్శకుడు జయకుమార్ ఆసక్తికర వాఖ్యలు..

     Written by : smtv Desk | Mon, Nov 20, 2023, 12:23 PM

అందాల నటుడు శోభన్ బాబు గురించి దర్శకుడు జయకుమార్ ఆసక్తికర వాఖ్యలు..

అలనాటి దర్శకుడు జయకుమార్ గురించి ప్రత్యేకించి పరిచయం అక్కర్లేదు. సీనియర్ దర్శక దిగ్గజం, కళాతపస్వి కె. విశ్వనాథ్ దగ్గర అనేక సినిమాలకు పని చేసిన జయకుమార్, ఆ తరువాత కాలంలో కొన్ని చిత్రాలకి దర్శకత్వం వహించారు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ శోభన్ బాబు గురించి ప్రస్తావించారు. "శోభన్ బాబు గారు నన్ను తమ్ముడూ అని పిలిచేవారు. అప్పారావుగారు అని ఆయన పర్సనల్ మేకప్ మేన్ శోభన్ బాబు కోసం 'రింగ్'తో కూడిన విగ్ సెట్ చేశారు. అప్పటి నుంచి ఆయన ఫాలోయింగ్ మరింత పెరిగిపోయింది" అన్నారు.
'డాక్టర్ బాబు' సినిమా సమయంలోనే శోభన్ బాబుకి .. జయలలితకు పరిచయమైంది. ఆ సినిమా షూటింగుకి జయలలిత మూడు నాలుగు కార్లలో ఒక యువరాణిలా వచ్చేవారు. ఒక కారులో మేకప్ .. కాస్ట్యూమ్స్, మరో కారులో ఫ్రూట్స్ .. కూలర్ .. ఫ్యాన్, మరో కారులో నుంచి ఆమె దిగేవారు. ఆమెతో మాట్లాడటానికి ముందుగా శోభన్ బాబుగారే ఆసక్తిని చూపేవారు" అని చెప్పారు.
"ఇక 'సంపూర్ణ రామాయణం' సినిమా షూటింగును, 'రంపచోడవరం' స్కూల్లో ఉంటూ, 'మారేడుమిల్లి'లో చేసేవాళ్లం. శోభన్ బాబుగారితో కబుర్లు చెప్పడానికి చంద్రకళ వచ్చినప్పటికీ, ఆయన రగ్గు కప్పుకుని మా దగ్గరికి వచ్చి మాతో పాటు చలికాచుకుంటూ కూర్చునేవారు" అంటూ ఆనాటి సంగతులను గురించి చెప్పారు. అందరు శోభన్ బాబు గారితో మాట్లాడేందుకు ఆసక్తి చూపుతుంటే శోభన్ బాబు గారు మాత్రం జయలలిత గారితో మాట్లాడేందుకు తాపత్రయ పడేవారు అన్నారు.

Untitled Document
Advertisements