ఏపీలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్-2024 హాల్ టికెట్ల విడుదల

     Written by : smtv Desk | Sat, Feb 24, 2024, 08:08 AM

ఏపీలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్-2024 హాల్ టికెట్ల విడుదల

ప్రభుత్వ టీచర్ ఉద్యోగం కొరకు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ రాసేందుకు ఎదురుచూస్తున్న అభ్యర్థులకు పరీక్షలు రాసేందుకు అవసరమైన టెట్-2024 హాల్ టికెట్లను ఏపీ ప్రభుత్వం నేడు విడుదల చేసింది. టెట్ అభ్యర్థులు తమ హాల్ టికెట్లను అధికారిక వెబ్ సైట్ aptet.apcfss.in నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఏపీ టెట్ పరీక్షలను ఫిబ్రవరి 27 నుంచి మార్చి 9 వరకు నిర్వహించనున్నారు. మార్చి 10న ప్రొవిజనల్ ఆన్సర్ కీ విడుదల చేయనున్నారు. అభ్యర్థులు మార్చి 11 వరకు కీపై తమ అభ్యంతరాలను తెలియపర్చవచ్చు. మార్చి 13న ఫైనల్ కీ విడుదల చేయనున్నారు. పరీక్షల అనంతరం మార్చి 14న టెట్ ఫలితాలు విడుదల చేయనున్నట్లు తెలిపారు.

Untitled Document
Advertisements