మాంసాహారం వండేటప్పుడు ఈ చిట్కాలు పాటిస్తే వంట త్వరగా అవుతుందట..

     Written by : smtv Desk | Fri, May 17, 2024, 02:13 PM

మాంసాహారం వండేటప్పుడు ఈ చిట్కాలు పాటిస్తే వంట త్వరగా అవుతుందట..

మాంసాహార వండేటప్పుడు ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే వంట త్వరగా అవడంతో పాటు రుచిగా కూడా ఉంటుంది..

* నాన్‌వెజ్ వండినప్పుడు మ్యారినేట్ చేస్తే కూర త్వరగా ఉడకుతుంది. దీనికోసం నిమ్మరసం, మసాలాలు కలిపి ముక్కలకి పట్టించి అలానే కాసేపు వదిలేయండి. దీని వల్ల నాన్‌వెజ్ చక్కగా నానడమే కాకుండా మసాలా అంతా ముక్కలకి పట్టి టేస్టీగా కూడా ఉంటుంది.
* ప్రెజర్ కుక్కర్‌లో వండితే త్వరగా వంట అవుతుంది. అందుకే, చాలా మంది ఈ కుక్కర్స్‌ని వాడుతున్నారు. ముఖ్యంగా నాన్‌వెజ్ త్వరగా ఉడికిపోతుంది.
* నాన్వెజ్ వంటలు ఎంతసేపటికి ఉడకకుండా విసిగిస్తున్నట్టుగా అనిపిస్తే కూరలో మామిడి ఆకు లేదా బిర్యాని ఆకు వేస్తె త్వరగా ఉడికిపోతాయి. ఆకు వేయడం ఇష్టం లేదు అనుకుందే పోకని పగలగొట్టు కాస్త ముక్కని కూరలో వేసినా ఉడికిపోతుంది.
* మీరు ఆల్కహాల్ తీసుకునే వారు అయితే గనుక ఒక మూత బ్రాందీ కూరలో వేస్తె కూర త్వరగా ఉడికిపోతుంది.

Untitled Document
Advertisements