వృద్దాప్య లక్షణాలు అరికట్టడంలో ఈ ఉల్లి బెస్ట్..

     Written by : smtv Desk | Sat, May 18, 2024, 04:31 PM

వృద్దాప్య లక్షణాలు అరికట్టడంలో ఈ ఉల్లి బెస్ట్..

వెల్లుల్లి వాసనకు చిరాకు పుడుతుంది. కానీ వంటల్లో దీనిని వాడితే వంట రుచి అద్భుతం. అలాగే ఇందులో ఉన్న మెడిసిన్ ప్రాపర్టీస్ కారణంగా ఆరోగ్యానికి కూడా బోలేడన్నీ లాభాలు ఉన్నాయి. ముఖ్యంగా వెల్లుల్లిలో ఎన్నో అద్భుత గుణాలు ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా అల్లిసిన్ అనే పోషకం ఉంటుంది. ఇందులో పవర్‌ఫుల్ యాంటీ మైక్రోబయల్, శరీరంపై బ్యాక్టీరియా, వైరస్‌లకి వ్యతిరేకంగా పోరాడే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఇమ్యూనిటీ పెరిగి అనారోగ్య సమస్యలతో పోరాడగల సామర్థ్యం పెరుగుతుంది. అందుకోసం రోజూ రాత్రి పడుకునే ముందు వెల్లుల్లి రెబ్బని తీసుకుంటే ఇమ్యూనిటీ పెరిగి ఇన్ఫెక్షన్స్ నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు. దీంతో పాటు ఏమేం లాభాలున్నాయో తెలుసుకోండి.

గుండె ఆరోగ్యం.. రాత్రి పడుకునే ముందు వెల్లుల్లి తింటే గుండె ఆరోగ్యం మెరుగవుతుంది. దీనికి కారణం వెల్లుల్లిలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించే గుణాలు ఉన్నాయి. కాబట్టి, రాత్రి పూట తింటే గుండె సమస్యలు దూరమవుతాయి. కాబట్టి, రాత్రి పడుకునే ముందు ఓ వెల్లుల్లి రెబ్బ తింటే మంచిది.

యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు.. వెల్లుల్లిలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది ఆక్సీకరణ ఒత్తిడితో పోరాడేందుకు, శరీరంలోని ఫ్రీ రాడికల్స్ అని పిలిచే క్యాన్సర్ కారక కణాల నుండి శరీరాన్ని రక్షించడంలో సాయపడుతుంది. రోజూ రాత్రి పడుకునే ముందు వెల్లుల్లి రెబ్బని తీసుకుంటే ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్ మీ శరీరాన్ని సెల్ డ్యామేజ్ నుండి కాపాడతాయి. దీంతో వృద్ధాప్య ప్రక్రియ తగ్గుతుంది. దీంతో చర్మ ఆరోగ్యం మెరుగవవ్వడమే కాకుండా అభిజ్ఞా పనితీరు మెరుగవుతుంది. దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదం తగ్గుతుంది.

బరువు తగ్గడం.. శరీరం బరువు తగ్గించడానికి, శరీరంలోలోని ట్యాక్సిన్స్‌ని తగ్గించేందుకు వెల్లుల్లి తినాలి. ఇదో సహజ క్లెన్సర్‌లా పనిచేస్తుంది. ఇక్కడ అల్లిసిన్ శరీరంలోని ట్యాక్సిన్స్‌ని దూరం చేస్తుంది. కాబట్టి, రోజు ఓ వెల్లుల్లి తీసుకుంటే బాడీ క్లీన్ అవుతుంది. శరీరంలోని మలినాలను తొలగించడానికి కొవ్వుని వాడడం వల్ల బరువు తగ్గుతారు.

మంచి నిద్ర కోసం.. వెల్లుల్లిలో ట్రిప్టోఫాన్ అనే పోషకం ఉంటుంది. ఇది నిద్రని ప్రేరేపించే అమైనో ఆమ్లం. దీనిని తీసుకోవడం వల్ల సెరోటోనిన్ ఉత్పత్తి పెరిగుతుంది. ఇది ఒక న్యూరో ట్రాన్స్మిటర్ నిద్ర, మేల్కోనే సమయాలని నియంత్రించడంలో సాయపడుతుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది. పడుకునే ముందు ఓ వెల్లుల్లి రెబ్బని తీసుకుంటే త్వరగా నిద్రపోతారు. ప్రశాంతంగా నిద్రపోతారు.

మొత్తంగా.. రాత్రి పడుకునే ముందు వెల్లుల్లి తీసుకుంటే కొలెస్ట్రాల్‌ని తగ్గించుకోవచ్చు. దీంతో బరువు కూడా తగ్గుతారు. ఇందులోని విటమిన్ బి 6, విటమిన్ సి, ఫైబర్, మాంగనీస్ వంటి పోషకాలు అందుతాయి. మొత్తం ఆరోగ్యానికి మంచిది.





Untitled Document
Advertisements