ఈ ఆహారపదార్థాలు నానబెట్టి ఉడికిస్తే జీర్ణక్రియ మెరుగవుతుందట

     Written by : smtv Desk | Sat, May 18, 2024, 05:00 PM

ఈ ఆహారపదార్థాలు నానబెట్టి ఉడికిస్తే జీర్ణక్రియ మెరుగవుతుందట

మనం ఆరోగ్యంగా జీవించాలి అంటే ఆహారం తప్పనిసరి. మనం తినే ఆహారంలో ఎన్నో రకాల పదార్థాలు ఉంటాయి. అయితే అన్ని రకాల ఆహారాలను మనం ఒకేరకంగా తినలేము. కొన్నింటిని ఉడికించి తింటే, మరికొన్నింటిని పచ్చిగా తినేస్తాము, ఇంకోన్నింటిని నానాబెట్టి తింటాము. కారణం ఒక్కో ఆహారాన్ని ఒక్కో విధంగా తీసుకోవడం వలన మన శరీరానికి అవి ఎక్కువ లాభాన్ని చేకూరుస్తాయి. కొన్ని పుడ్స్‌ని నానబెడితే అవి మన మన శరీరంలోకి పూర్తిగా గ్రహించబడతాయి. జీర్ణక్రియని ఈజీగా చేస్తాయి. కొన్ని ఫుడ్స్ గట్ ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే రసాయనాలు, ఎంజైమ్స్‌ని కలిగి ఉంటాయి. వాటిని పూర్తిగా తీసేశాకే తీసుకోవాలి. అలా మనం తినాల్సిన ఫుడ్స్ గురించి తెలుసుకోండి.

* నానబెడితే.. కొన్ని పుడ్స్‌ని నానబెడితే అవి మన మన శరీరంలోకి పూర్తిగా గ్రహించబడతాయి. జీర్ణక్రియని ఈజీగా చేస్తాయి. కొన్ని ఫుడ్స్ గట్ ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే రసాయనాలు, ఎంజైమ్స్‌ని కలిగి ఉంటాయి. వాటిని పూర్తిగా తీసేశాకే తీసుకోవాలి. అలా మనం తినాల్సిన ఫుడ్స్ గురించి తెలుసుకోండి.
* ఓట్స్.. ఓట్స్‌లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. వీటిని ఉడికించే ముందు కాసేపు నానబెట్టాలి. ఓట్స్‌ని పాలు, నీరు, పెరుగులో రాత్రంతా నానబెట్టాలి. అప్పుడు అందులోని ఫైటిక్ యాసిడ్ విచ్ఛిన్నమై జీర్ణం సులభమవుతుంది.
* చియా సీడ్స్.. చియాసీడ్స్, అవిసెలు వంటి వాటిని కూడా నానబెట్టి తినడం అలవాటు చేసుకోండి. వీటిలో ఫైబర్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. వీటిని నానబెట్టి తింటే అందులోని పోషకాలు పూర్తిగా అందుతాయి. ఇవి జీర్ణక్రియని మెరుగ్గా చేస్తాయి.
* డ్రైఫ్రూట్స్.. ఎండుద్రాక్ష, అత్తిపండ్లు, ఆప్రికాట్స్, ప్రూనే వంటి డ్రై ఫ్రూట్స్ ఏవైనా కూడా నానబెట్టి తింటే మంచిది. వీటిని ఇలా నానబెట్టి తింటే జ్యూసీగా ఫ్లేవర్ ఫుల్‌గా ఉంటాయి.
* చిరుధాన్యాలు.. నేటి కాలంలో చాలా మంది చిరు ధాన్యాలను ఇష్టంగా తీసుకుంటున్నారు. వీటిని కూడా వండే ముందు బాగా నానబెట్టి తీసుకోవాలి. వీటిని నానబెట్టి ఉడికిస్తే జీర్ణక్రియని మెరుగ్గా చేస్తుంది.
* బీన్స్.. అన్నిరకాల బీన్స్, పప్పులు నానబెడితే చాలా మంచిది. అప్పుడే అవి చక్కగా ఉడుకుతాయి. అందులోని పోషకాలు మనకి అందుతాయి. దీని వల్ల కుకింగ్ టైమ్ కూడా తగ్గుతుంది. అన్నింటికంటే ముఖ్యంగా జీర్ణక్రియ ఈజీ అవుతుంది.
* నట్స్.. జీడిపప్పు, బాదం, గుమ్మడి గింజలు, మిగతా నట్స్ అలానే తినడం, ఫ్రై చేసి తినడం కంటే నానబెట్టి తింటే మంచిది. నానబెట్టినప్పుడు దాని చర్మంలోని చెడు ఎంజైమ్స్ తొలగిపోతాయి. జీర్ణక్రియని ఈజీ చేస్తాయి. పోషకాలు కూడా పూర్తిగా అందుతాయి.

Untitled Document
Advertisements