లాభాలతో మొదలైన స్టాక్ మార్కెట్ సూచీలు.. కోలుకుంటున్న అదానీ గ్రూప్స్

     Written by : smtv Desk | Wed, Feb 08, 2023, 11:36 AM

లాభాలతో మొదలైన స్టాక్ మార్కెట్ సూచీలు.. కోలుకుంటున్న అదానీ గ్రూప్స్

గడిచిన రెండు రోజులుగా స్టాక్ మార్కెట్లు నష్టాలను చవిచూస్తున్న విషయం తెలిసిందే. అయితే రెండు రోజులుగా నష్టాలలో కూరుకుపోయిన స్టాక్ మార్కెట్లు నేడు కాస్త తెరుకున్నాయి. ఆర్‌బీఐ ద్రవ్యపరపతి విధాన సమీక్ష నిర్ణయాలు నేడు వెలువడనుండటంతో సూచీలు బుధవారం ఉదయం నుంచే లాభాల బాట పట్టాయి. తొమ్మిదిన్నర గంటల సమయానికి సెన్సెక్స్ 307 పాయింట్ల మేరకు పెరిగి 60,593 వద్ద కదలాడుతోంది. నిఫ్టీ కూడా 106 పాయింట్లు పుంజుకుని 17,828 వద్ద కొనసాగుతోంది.
ఇక డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ రూ.82.66 వద్ద ట్రేడవుతోంది. ముందస్తుగా అప్పులు చెల్లిస్తామన్న గౌతమ్ అదానీ ప్రకటనతో అదానీ గ్రూప్ షేర్లు క్రమంగా కోలుకుంటున్నాయి. అదానీ ఎంటర్ ప్రైజెస్, అదానీ పోర్ట్స్ షేర్లు ప్రస్తుతం లాభాల బాటలో ఉన్నాయి. అల్ట్రాటెక్ సిమెంట్, హిందాల్కో, ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా..పవర్ గ్రిడ్ కార్ప్, హీరోమోటో కార్ప్, భారతీ ఎయిర్ టెల్, కోల్ ఇండియా, ఐషర్ మోటార్స్ షేర్లు నష్టాల్ని చవిచూస్తున్నాయి.





Untitled Document
Advertisements