ఉసిరికాయ వడియాలలో ఇన్ని ఆరోగ్యప్రయోజనాల!

     Written by : smtv Desk | Wed, Feb 08, 2023, 03:08 PM

ఉసిరికాయ వడియాలలో ఇన్ని ఆరోగ్యప్రయోజనాల!

మన ఆరోగ్యం మనం తీసుకునే ఆహారం మీదే ఆధారపడి ఉంటుంది అనే విషయం తెలిసినప్పటికీ అనేక మంది ఆహారం విషయంలో అశ్రద్ధ చూపడం మనకు తెలిసిన విషయమే. కాలాలకి అనుగుణంగా మన ఆహారంలో కొద్దిపాటి మార్పులు చేర్పులు చేసుకుంటూ.. సీజనల్ ఫుడ్స్ ని ఆహారంలో భాగం చేసుకోవడం వలన మనం అనారోగ్యాల భారిన పడకుండా ఉంటాము. ఏ విధంగా అంటారా మనం తీసుకునే ఆహారంలోనే కొన్ని రకాలా ఔషధ గుణాలు దాగుంటాయి వాటి కారణంగానే మనల్ని ఎటువంటి వ్యాధులు దరిచేరవు. ఒక వేళ ఏవైనా అనారోగ్య సమస్యలు ఉన్నా అవి కూడా తొలగిపోతాయి.
అటువంటి అద్భుతమైన ఆహార పదార్థాలలో ఉసిరికాయ ఒకటి ఇది మనకు ప్రకృతి ప్రసాదించిన దివ్యమైన ఔషధం వంటిది. ఉసిరికాయల్ని అవి దొరికే సీజన్లో సేకరించండి. బాగా ముదిరి పండిన ఉసిరికాయల్ని మెత్తగా దంచి, గింజలు తీసేసి, ఆ గుజ్జుని మినప్పప్పులోవేసి తగినంత ఉప్పు, కారం, అల్లం వగైరాలు కలిపి గుడ్డమీద వడియాలు వేసి ఎండించి, రోజూ వేయించుకోకుండా నేరుగానే తినండి. అన్నంలో నంచుకుని తిన్నా బాగానే వుంటాయి.
ఇవి రోజు తింటే విరేచనం మృదువుగా అవుతుంది. వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. రక్తస్రావం ఆగి, మొలలు త్వరగా తగ్గుతాయి.
మధుమేహ వ్యాధి వున్నవారు తప్పకుండా వీటిని తింటే మేహశాంతి కలుగుతుంది. అంటే వ్యాధి తీవ్రత తగ్గుతుందన్నమాట.
ఈ వడియాలు ఒంట్లోని వేడిని తగ్గిస్తాయి. అంతే కాక కడుపులో మంట, గ్యాస్ ట్రబుల్ని పోగొడతాయి.





Untitled Document
Advertisements