ఎడ తెగక వచ్చే ఎక్కిళ్ళకు ఉసిరికాయతో చెక్!

     Written by : smtv Desk | Thu, Feb 09, 2023, 05:36 PM

ఎడ తెగక వచ్చే ఎక్కిళ్ళకు ఉసిరికాయతో చెక్!

ఎక్కిళ్ళు రావడం అనేది సర్వ సాధారణమైన విషయం అయితే కొందరిలో ఈ ఎక్కిళ్ళు ఆగకుండా వస్తు ఎంతో ఎబ్బండుకి గురిచేస్తుంటాయి. నిజానికి ఎక్కిళ్ళు రావడానికి కారణం వాతం చేసే ఆహార పదార్ధాలు గానీ, వేడి చేసే పదార్థాలుగానీ, అతిపుల్లని పదార్ధాలుగానీ, అరగని ఆహారంగానీ ఎక్కువగా తీసుకోవడం. పచ్చళ్లు, కారాలు, మషాలాలు అతిగా తినేవారికి ఎక్కిళ్ళు ఆగకుండా వస్తాయి. అయితే ఈ ఎక్కిళ్ళు కొందరిలో రోజుల తరబడి నిలబడి పోతాయి కూడా. అటువంటప్పుడు వారు ఏంచేయాలి అనేది తెలుసుకుందాం..

* లవంగాన్ని బుగ్గన పెట్టుకొని చప్పరించండి. ఎక్కిళ్ళు ఆగుతాయి.
* ఏలకులు లోపలి గింజలు, పటికబెల్లం కలిపి నూరి ఓ చెంచా పొడిని పాలలో కలుపుకొని తాగండి లేదా నేరుగా తినేసేయండి. ఎక్కిళ్లు తగ్గుతాయి.
* 'అతి మధురం' పాడి "యష్టిచూర్ణం" పేరుతో బజార్లో దొరుకుతుంది ఈ యష్టిచూర్ణం 1/2చెంచా పొడిలో తేనె కలుపుకొని తింటే ఎక్కిళ్ళు ఆగుతాయి.. యష్టి చూర్ణాన్ని అంతకన్నా ఎక్కువగా తింటే వాంతులవుతాయి. ఎక్కిళ్లు అవుతున్నప్పుడు వాంతి అయితే, నిజానికి చాలా రిలీఫ్ గా వుంటుంది. చూసుకొని. వాడుకోండి.
* పిప్పళ్ళను నేతిలో వేయించి, తగినంత పంచదారవేసి మెత్తగా దంచి 1/2 చెంచా పాడిని నోట్లో వేసుకొని పాలుగానీ, పులవని మజ్జిగగానీ తాగితే ఎక్కిళ్లు ఆగుతాయి.
* పేరు నెయ్యిలో పంచదార వేసుకొని తినడం, గోరు వెచ్చటి పాలలో పంచదార వేసుకొని తాగడం.. వీటి వలన కూడా ఎక్కిళ్ళు ఆగుతాయి.
* ఒక్కోసారి, ఐస్ వేయకుండా మంచి చెరుకు గడను పిండిన చెరుకు రసం ఎక్కిళ్ళని తగ్గిస్తుంటుంది !
* వెలగ పండు గుజ్జులో పిప్పళ్ల పొడిని కలుపుకొని తింటే ఎక్కిళ్లు ఆగుతాయి.
* పచ్చళ్లు పెట్టుకునే ఉసిరికాయని ఆమలకి అంటారు. ఈ ఆమలకి కాయలు తాజాగా దొరికితే, దంచి రసంతీసి, ఆ రసంలో పిప్పళ్ళ పొడిని నేతిలో వేయించి కలిపి తాగితే ఎక్కిళ్లు ఆగుతాయి.
* ఎండు ఖర్జూరాలు, పిప్పళ్ళు, ఎండు ద్రాక్ష, పంచదార ఈ నాల్గింటినీ సమానంగా తీసుకొని, అన్నింటినీ కలిపి నూరి, 1 చెంచా పొడిలో తేనె కలిపి. తీసుకొంటే ఎక్కిళ్లు ఆగుతాయి. ఆయాసం తగ్గిపోతుంది.





Untitled Document
Advertisements