బడ్జెట్ ధరలోనే ఓలా వారి సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్

     Written by : smtv Desk | Fri, Feb 10, 2023, 11:53 AM

బడ్జెట్ ధరలోనే ఓలా వారి సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్

ప్రస్తుతం రహదారుల వెంట కనిపించే ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య నానాటికి పెరిగిపోతుంది. కారణం,పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరల మూలంగానే దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు భారీగా పెరుగుతోంది. ఖరీదులో దాదాపు సమానంగా ఉండడం, నిర్వహణ ఖర్చు తక్కువగా ఉండడంతో వాహనదారులు ఎలక్ట్రిక్ వాహనాలను కొనేందుకు మొగ్గుచూపుతున్నారు. ఈ నేపథ్యంలో టూవీలర్ మార్కెట్లోకి కొత్త కొత్త మోడల్స్ వస్తున్నాయి.
తాజాగా ఓలా కంపెనీ కూడా సరికొత్త ఈ-స్కూటర్ ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఓలా ఎస్ 1 ఎయిర్ పేరుతో మార్కెట్లోకి విడుదల చేసిన ఈ స్కూటర్ ఖరీదు రూ.84,999 ల నుంచి మొదలవుతుందని, గరిష్టంగా రూ.1,09,999 ఉంటుందని కంపెనీ పేర్కొంది. ఓలా ఎస్ 1 ఎయిర్ స్కూటర్ ను ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే దాదాపు 85 కిలోమీటర్ల నుంచి 165 కిలోమీటర్లు ప్రయాణించ వచ్చని కంపెనీ సీఈవో భవీష్ అగర్వాల్ చెబుతున్నారు.
ప్రస్తుతం ఈ స్కూటర్ ను 3 వేరియంట్లలో తీసుకొచ్చినట్లు వివరించారు. ఇందులో సరికొత్తగా 2కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ఆప్షన్ ఉందని తెలిపారు. రోజూ తక్కువదూరం ప్రయాణించే వారి కోసం.. అంటే రోజూ 20 నుంచి 30 కిలోమీటర్లు మాత్రమే ప్రయాణించే వారిని దృష్టిలో పెట్టుకుని ఈ 2కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ వేరియంట్ స్కూటర్ (ఓలా ఎస్ 1) ను డిజైన్ చేశామన్నారు. దీని ఖరీదు రూ.99,999 మాత్రమేనని, ఒక్కసారి చార్జ్ చేసి 91 కిలోమీటర్లు ప్రయాణించవచ్చని భవీష్ చెప్పారు. పెరిగిన పెట్రోల్ చార్జీలతో ఇబ్బంది పడుతున్నవారికి ఈ స్కూటర్ మంచి ఎంపిక మరి ఆలస్యం దేనికి వెంటనే కోనేసేయండి. ఇటు పెట్రోల్ ఖర్చుల భారం అటు వాతావరణ కాలుష్యం రెండు తగ్గుతాయి.





Untitled Document
Advertisements