నీటిలో నాన బెట్టిన అంజీర్ తింటే బరువు తగ్గుతారట

     Written by : smtv Desk | Sat, Feb 11, 2023, 01:10 PM

 నీటిలో నాన బెట్టిన అంజీర్ తింటే బరువు తగ్గుతారట

మనకు ప్రకృతి ప్రసాదించిన వరాలలో పండ్లు, కురగాయాలు అత్యంత ప్రాముఖ్యత కలిగినవి. మన శరీర ఆరోగ్యంలో ప్రముఖ పాత్ర పోషించేవి ఇవే. అటువంటి ప్రాముఖ్యత కలిగిన పండ్లలో అంజీర్ ఒకటి. కొన్ని పండ్లను మనం అప్పటికప్పుడే తినేయాలి లేదంటే అవి పాడైపోతాయి. కానీ, ఈ అంజీర్ పండ్లను మాత్రం అప్పటికప్పుడు తిన్నా లేదా ఎందబెట్టుకుని తిన్నా బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు చేకురతాయి.
అంజీర్ పండుకు మరో పేరు మేడి పండు అని, ఫిగ్ అని అంటుంటారు. వీటివల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. ప్రతి రోజు రాత్రి 3-4 అంజీరాలను నీటిలో వేయాలి. ఉదయం పరగడుపునే నానవేసిన అంజీరాలను తినాలి. ఆ నీటిని తాగేయడం వల్ల తక్షణ శక్తి లభిస్తుంది.

బరువు తగ్గడానికి:- అంజీరా బరువు తగ్గడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఇందులో ఫైబర్ ఎక్కువ. అందుకనే ఉదయాన్నే తినడం వల్ల ఎక్కువ సమయం పాటు ఆకలి తెలియదు. జీర్ణం అయ్యేందుకు చాలా సమయం తీసుకుంటుంది. కడుపు నిండుగా ఉండడం వల్ల ఏది పడితే అది తినేయకుండా నియంత్రించుకోవచ్చు.

పేగుల్లో చురుకుదనం:- మేడి పండులో సొల్యూబుల్, ఇన్ సాల్యుబుల్ ఫైబర్ ఉంటుంది. దీనివల్ల జీర్ణాశయాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. మలబద్ధకం సమస్య రాకుండా చూసుకోవచ్చు. ముఖ్యంగా మలబద్ధకంతో బాధపడేవారు తమ ఆహారంలో భాగంగా అంజీరాని రోజూ తప్పకుండా తినాలి.

మధుమేహానికీ మంచిదే:- మధుమేహం ఉన్న వారు కూడా నీటిలో అంజీరాను నానవేసి తినొచ్చు. వీటిల్లో క్లోరోజెనిక్ యాసిడ్, పొటాషియం, ఒమెగా 3, 6 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. దీంతో రక్తంలో గ్లూకోజ్ నియంత్రిత స్థాయిలో ఉంచడంలో వీటి పాత్ర ఎక్కువ.

గుండె ఆరోగ్యానికీ:- అంజీరాని తినడం వల్ల రక్తంలో చెడు కొలెస్ట్రాల్, ట్రై గ్లిజరాయిడ్స్ తగ్గుతాయి. చెడు కొలెస్ట్రాల్ పెరిగితే రక్త నాళాలు మూసుకుపోయి గుండె పోటు వస్తుందని తెలిసిందే. అంజీరాని రోజూ తినేవారికి ఈ సమస్య దాదాపుగా ఉండదు.

ఎముకలు గట్టిదనానికి:- మహిళలు, వృద్ధులు, చిన్నారులకు క్యాల్షియం అవసరం ఎక్కువగా ఉంటుంది. అంజీరాని రోజూ తినేవారికి క్యాల్షియం తగినంత అందుతుంది. పొటాషియం, క్యాల్షియం కూడా ఆరోగ్యానికి మంచివే.

గర్భిణులు:- అంజీరాలో విటమిన్ బీ6, ఒమెగా ఫ్యాటీ 3 యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఉదయాన్నే డల్ గా ఉండేందుకు వీటి లోపమే కారణం. గర్భిణులు అంజీరాని తినడంవల్ల ముందస్తు గర్భస్రావాలు తగ్గుతాయి.

కేన్సర్ రిస్క్:- అంజీరాతో కేన్సర్ రిస్క్ తగ్గించుకోవచ్చు. బ్రెస్ట్, కొలన్ కేన్సర్ రిస్క్ ప్రధానంగా తగ్గుతుంది. ఫిగ్స్ లో విటమిన్ సీ తగినంత ఉన్నందున వ్యాధి నిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది.

మరి ఆలస్యం దేనికి ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలున్న అంజీరాని మీ రోజువారి ఆహారంలో భాగంగా చేసుకుని అద్భుతమైన
ఆరోగ్య ప్రయోజనాలు పొందడి.





Untitled Document
Advertisements