వసతో నస నిజమేనా..?

     Written by : smtv Desk | Wed, Feb 15, 2023, 01:56 PM

వసతో నస నిజమేనా..?

ఎవరైనా అతిగా మాట్లాడినప్పుడు నీకు చిన్నప్పుడు వస ఎక్కువ పోసినట్టున్నారు అందుకే ఇంతలా నాసా పెడుతున్నావు అనడం మనం తరచుగా వింటూనే ఉంటాము. నిజంగానే వసపోస్తే ఎక్కువగా మాట్లడేస్తారా? అనరు అనుమానం మీలో కలిగే ఉంటుంది. మరి నిజంగానే వసతో నాసా అలవాటు అవుతుందా? లేదంటే మరే ఇతర ప్రయోజనాలు ఉనాయి అనేది మనం ఎప్పుడు తెలుసుకుందాం.
* వన యొక్క పచ్చివేరు రసం తీసి రెండు చెంచాలు ప్రతిరోజు పుచ్చుకుంటే, నీరసం తగ్గి సత్తువ వస్తోంది.
* బట్టలుంచే అల్మరాల్లో వసకొమ్ములను నాల్గింటిని ఉంచండి. వాటిలోకి ఏ పురుగు చేరదు.
* తలనొప్పా? వసతో గంధం తీసి, తలకి పట్టి వేసుకోండి. మీ తలనొప్పి ఇట్టే తగ్గిపోతుంది.
* పప్పుధాన్యాలు నిల్వ చేసుకునేటప్పుడు వాటి మధ్యలో వస కొమ్ముల పొడి చేసి చల్లండి పురుగు పట్టదు.
* గొంతు నొప్పితో బాధపడేవారు వసను పొడి చేసుకొని, ఆవుపాలతో ఓ చిటికెడు కలుపుకొని తాగితే సరి.
* శొంటి కషాయంతో చిటికెడు వస కలిపితే పిత్తనాళం నశిస్తుంది.
* పంచదార పాకంలో వసపోసి, కలిపి, బిళ్ళలుగా తయారు చేసుకొని వాటిని ప్రతిరోజు ఉదయం సాయంత్రం రెండు బిళ్ళలు తీసుకుంటే, ఏ అంటు వ్యాధులు రాకుండా ఆరోగ్యంగా ఉంటారు.
* వసకొమ్ము వేసి మరిగించిన నీటితో స్నానం చేస్తే అలసట తగ్గటమే కాకుండా నిస్సత్తువ అనేది లేకుండా, ఎంతో ఉత్సాహంగా ఉంటుంది. ముఖ్యంగా మూర్ఛ రోగులకు, అనారోగ్యంతో బాధపడేవారికి ఈ స్నానం. ఎంతో మేలు చేస్తుంది.
* అతిదాహం, పొడిదగ్గు ఉన్నవారికి వసను నిప్పులపై కాల్చి దాన్ని బుగ్గన ఉంచు కుంటే రెండు తగ్గిపోతాయి. పొడిదగ్గు దోషం కూడా తగ్గిపోతుంది.
* జలుబు దగ్గుతో బాధపడేవారు వసకొమ్మును నీటితో సానపై అరగదీసి ఆ గంధాన్ని రొమ్ములపై పూయండి. శ్వాస బాగా ఆడుతుంది. త్వరగా ఉపశమనం కలుగుతుంది.
* మాటలు రానివారికి వనను పట్టాలని పెద్దలంటుంటారు. వసను చిన్న పిల్లలకు పట్టేది ఉదర వ్యాధులు, వికారాలు కలుగకుండాఉండటానికే, దేహ, బుద్ధిబలాలు పెంపొందించడానికి వసపోస్తారు.
మరి వసతో నస కాదు ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయనే విషయాన్ని తెలుసుకున్నారు కదా వెంటనే వాడుకోవడం మొదలు పెట్టండి.





Untitled Document
Advertisements