ఆస్ట్రేలియాలో అదానీకి నిరసనల సెగలకు..

     Written by : smtv Desk | Wed, Feb 15, 2023, 02:03 PM

ఆస్ట్రేలియాలో అదానీకి నిరసనల సెగలకు..

అదానీ గ్రూప్ వ్యాపారాలపై వస్తున్న వార్తలతో నేపధ్యంలో ఆ సంస్థ మరింత కష్టాల్లో కురుకుపోతుంది. ఈ క్రమంలో సంస్థ అధినేత అదానీకి ఇబ్బందులు పెరుగుతున్నాయి. ఇప్పటికే ఈ సంస్థ పెడుబడి దారుల నమ్మకాన్ని కోల్పోవడంతో షేర్స్ విలువలు పడిపోతూ వస్తు తీవ్రమైన నష్టాలను చవిచుస్తుంది. మరోవైపు ఆస్ట్రేలియాలో సైతం అదానీకి వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అదానీ ప్రాజెక్టులకు రుణాలు ఇవ్వొద్దని బ్యాంకుల ముందు ఆ దేశ ప్రజలు ధర్నాలు చేశారు. స్టాప్ ఫండింగ్ అదానీ కోల్, స్టాప్ అదానీ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆస్ట్రేలియాలోని క్వీన్స్ లాండ్ లో అదానీ సంస్థ కార్మెకెల్ బొగ్గు గనిని నిర్వహిస్తోంది. ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఆస్ట్రేలియాలో పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. ఇప్పుడు ఆ సంస్థకు లోన్లు ఇవ్వొద్దంటూ ధర్నాకు దిగాయి. అదానీ సంస్థకు ప్రస్తుతం ఎదురవుతున్న ఇబ్బందులు చూస్తుంటే కష్టాల నుండి ఈ సంస్థ గట్టేక్కేనా అనిపిస్తుంది.





Untitled Document
Advertisements