భారత మార్కెట్లోకి మరో రెండు కొత్త ఫోన్లు.. ధర ఎంతంటే?

     Written by : smtv Desk | Thu, Feb 16, 2023, 11:41 AM

 భారత మార్కెట్లోకి మరో రెండు కొత్త ఫోన్లు..  ధర ఎంతంటే?

ప్రస్తుత యుగంలో ఒకపూట తిండి లేకున్నా ఉండగాలరేమో గాని క్షణం చేతిలో ఫోన్ లేకుండా ఉండలేని స్థితిలో ఉన్నారు. అంతలా ఫోన్ కి అడిక్ట్ అయిపోయారు జనాలు. మరి అటువంటి స్మార్ట్ ఫోన్ ప్రియుల కొరకు మరో రెండు ఫోన్ లు అందుబాటులోకి వచ్చాయి. హెచ్ఎండీ గ్లోబల్ సంస్థ నోకియా ఎక్స్30 5జీ స్మార్ట్ ఫోన్ ను భారత మార్కెట్లో విడుదల చేసింది. 8జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ తో వచ్చే దీని ధర రూ.48,999. ఇది కూడా పరిమిత కాలం పాటు ఉంటుంది. ఆ తర్వాత మళ్లీ ధర పెరుగుతుంది.

నోకియా ఎక్స్ 30 5జీ ఫోన్ లో 6.43 అంగుళాల అమోలెడ్ ప్యూర్ డిస్ ప్లే, 90హెర్జ్ రీఫ్రెష్ రేటు, స్నాప్ డ్రాగన్ 695 ప్రాసెసర్, అండర్ డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటాయి. ప్యూర్ డిస్ ప్లే మరింత బ్రైట్ నెస్, ప్రభావవంతమైన రంగులకు సపోర్ట్ చేస్తుందని హెచ్ఎండీ గ్లోబల్ తెలిపింది.

వెనుక భాగంలో 50 మెగాపిక్సల్ ప్రధాన కెమెరా, 13 మెగాపిక్సల్ అల్ట్రా వైడ్ కెమెరా ఉన్నాయి. ముందు భాగంలో 16 మెగాపిక్సల్ కెమెరా ఏర్పాటు చేశారు. ఈ ఫోన్ లో గోప్రో క్విక్ యాప్ ఇన్ స్టాల్ చేసి ఉంటుంది. దీని సాయంతో యూజర్లు ఫొటోలు, వీడియోలను ఎడిట్ చేసి, తమ సృజనాత్మకత చాటుకోవచ్చు. 33 వాట్ ఫాస్ట్ చార్జర్ తో వస్తుంది. ఫిబ్రవరి 20 నుంచి అమెజాన్ లో విక్రయాలు జరుగుతాయి.

ఒప్పో ఫైండ్ ఎన్2 ఫ్లిప్ ఫోన్ అంతర్జాతీయంగా విడుదల చేసింది. ఒప్పో నుంచి ఇది తొలి ఫోల్డబుల్ ఫోన్. ఈ ఫోన్ ప్రధాన డిస్ ప్లే 6.8 అంగుళాల సైజుతో, 120 హెర్జ్ రీఫ్రెష్ రేటుతో ఉంటుంది. ఫోల్డ్ చేసినప్పుడు పైన కనిపించే స్క్రీన్ 3.26 అంగుళాల సైజుతో ఉంటుంది. ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 9000 ప్లస్ చిప్ సెట్ పై పనిచేస్తుంది.

50 మెగాపిక్సల్ ప్రధాన కెమెరా వెనుక భాగంలో ఉంటుంది. 8 మెగాపిక్సల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్, ముందు భాగంలో 32 మెగాపిక్సల్ కెమెరా, 4,300 ఎంఏహెచ్ బ్యాటరీ, 44 వాట్ చార్జర్ తో వస్తుంది. ఈ ఫోన్ భారత్ లో విక్రయ ధరను ఒప్పో ఇంకా ప్రకటించలేదు. మరి ఈ రెండు ఫాన్స్ మార్కెట్లో ఏ మేరకు తమ అమ్మకాలను జరుపుకుంటాయి అనేది చూడాలి.





Untitled Document
Advertisements