కీళ్ళనొప్పులకు ఉల్లిపాయతో ఇలా చేయండి..

     Written by : smtv Desk | Thu, Feb 16, 2023, 04:10 PM

కీళ్ళనొప్పులకు ఉల్లిపాయతో ఇలా చేయండి..

ప్రస్తుత కాలంలో మారిన జీవన శైలీ కారణంగా వయసుతో సంబంధం లేకుండా కీళ్ళ మరియు కాళ్ళ నొప్పులతో భాదపడుతున్నారు. అటువంటి వారు ఎన్నిరకాల మందులు వాడిన ప్రయోజనం శూన్యం. అలాంటప్పుడు ఈ ఇంటి చిట్కాలతో మీ కీళ్ళ మరియు కాళ్ళ నొప్పుల నుండి ఉపశమనం పొందండి సులభంగా..
* కొబ్బరి నూనెలో కొంచెము పిప్పరమెంట్ నూరి కలిపి పై పూత మందుగా పూస్తుంటే కీళ్ళ నొప్పులకు ఉపశమనం లభిస్తుంది.
* ఉల్లిపాయను మెత్తగా నూరి, ఆవనూనెలో వేయించి, కీళ్ళ నొప్పులకు పైన పట్టు వేస్తే నొప్పులు త్వరగా తగ్గుతాయి.
* ఆముదపు ఆకులను వెచ్చచేసి, కీళ్ళపై కాపడము పెడుతుంటే కీళ్ళ నొప్పులు తగ్గిపోతాయి.
* కొబ్బరినూనెలో ఇంగువ పొడి కలిపి, పై పూతగా రాస్తుంటే కీళ్ళ నొప్పుల నుండి ఉపశమనం కలుగుతుంది.
* పత్తిగింజలనూనెను, పై పూతగా పూస్తుంటే కీళ్ళ నొప్పులు తగ్గుతాయి.
* మిరియాలు, బియ్యం కలిపిఉడికించి పట్టువేసినా లేదా ఆముదం వేడిచేసి మర్ధించినా నొప్పులు తగ్గిపోతాయి.
* నువ్వుల నూనె, మరియు నిమ్మరసం సమభాగములు కలిపి కీళ్ళపై మర్దన చేస్తుంటే గుణం కనిపిస్తుంది.





Untitled Document
Advertisements