వందేళ్ళ తరువాత గమ్యం చేరిన లేఖ..

     Written by : smtv Desk | Fri, Feb 17, 2023, 11:41 AM

వందేళ్ళ తరువాత గమ్యం చేరిన లేఖ..

ఇప్పుడంటే టెక్నాలజీ అభివృద్ధి చెంది మనం ఏదైనా విషయం ఒకచోటు నుండి మరొక చోటికి చేరవేయడానికి ఫోన్ కాల్స్ చేసుకోవడం లేదా మెసేజ్ చేయడం, మెయిల్స్ పంపడం వంటివి చేస్తున్నాము. కానీ టెక్నాలజీ అందుబాటులో లేని రోజులలో వ్యక్తుల మధ్య సంబంధాలకు లేఖలు ముఖ్య వారధిగా ఉండేవి. అప్పట్లో టెలిఫోన్ సౌకర్యం చాలా ప్రాంతాలకు ఉండేది కాదు. అందుకే ఏ సంప్రదింపులు అయినా లేఖల రూపంలో ఉండేవి. లండన్ లో ఓ లేఖ పోస్ట్ చేసిన 100 ఏళ్ల తర్వాత ఇటీవలే డెలివరీ అయింది. మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో 1916లో ఈ లేఖను క్రిస్టాబెల్ మెన్నెల్ అనే యువతి తన ఫ్రెండ్ అయిన కేటీ మార్ష్ కు పోస్ట్ చేశారు.
వందేళ్ల తర్వాత 2021లో ఈ లేఖ లండన్ లోని ఓ ఫ్లాట్ వద్ద లెటర్ బాక్స్ లో తేలింది. రాయల్ మెయిల్ సిబ్బంది వందేళ్ల తర్వాత జాగ్రత్తగా డెలివరీ చేసింది. నిజానికి ఈ లేఖను అందుకోవాల్సిన వ్యక్తి భూమిపై లేరు. సంబంధిత ఫ్లాట్ లో ఉండే గ్లెన్ (27) అనే వ్యక్తి ఈ లేఖను చూసి ఆశ్చర్యపోయారు. ఏడాది పాటు ఈ లేఖను అలా చూసిన తర్వాత చివరికి హిస్టారికల్ సొసైటీకి అందించారు. ఇంత కాలం పాటు ఎందుకు డెలివరీ చేయలేదనే దానికి రాయల్ మెయిల్ నుంచి ఎలాంటి సమాధానం లేదు. సార్టింగ్ ఆఫీసులో ఇది తప్పిపోయి ఉండొచ్చని భావిస్తున్నారు





Untitled Document
Advertisements