ప్రపంచంలోనే అతి పెద్ద, అతి చిన్న ఊసరవెల్లి?

     Written by : smtv Desk | Fri, Feb 17, 2023, 03:43 PM

ప్రపంచంలోనే అతి పెద్ద, అతి చిన్న ఊసరవెల్లి?

ఎవరైనా ఒక వ్యక్తి అవసరానికి అనుగుణంగా మాట మార్చడం చూసినప్పుడు అలాంటి వ్యక్తిని ఉసరవెల్లి అనడం మనం వింటూనే ఉంటాము. మరి ఉసరవెల్లి గురించి మనకు ఎం తెలుసనీ వాటితో పోల్చేస్తున్నాము. ఎప్పుడు ఉసరవెల్లి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.. అలాగే ప్రపంచంలోనే అతి పెద్ద మరియు అతి చిన్న ఉసరవెల్లి ఎక్కడుంది అనేది తెలుసుకుందాం.
ఇండోనీషియా దీవులు కొన్నిట్లో కనబడే కొమొడో డ్రాగన్ అతిపెద్ద ఊసరవెల్లి. 10 అడుగులు (3 మీటర్ల) వరకు పొడవు వుంటుంది. బరువు 300 కిలోగ్రాములు. చిత్రమేమంటే, వాటి అస్తిత్వం గూర్చి మనుషులకు 100 సంవత్సరాలుగా మాత్రమే తెలుసు. కొమొడో డ్రాగన్లు చాలా ఓపికగా వేటాడతాయి. తాము భుజించబోయే ప్రాణి సమీపానికి వచ్చేవరకు అది మరుగున వుంటుంది. ఆ ప్రాణి దగ్గరకురాగానే అది తన బలమైన కాళ్లతో లంఘించి, పదునైన కాలిగోళ్లు, పళ్లతో ఆ ప్రాణిని తునకలు చేస్తుంది. కొమొడో డ్రాగన్ కాటు విషపూరితం. అది కాటువేసిన తన ఆహార ప్రాణి రక్తం 24 గంటల్లో విషపూరితమై అది మరణిస్తుంది.
కేవలం 16 మిల్లీమీటర్ల పొడవు వుండే స్పాయిరోడాక్టిలస్ అరియాసె ప్రపంచంలో అతిచిన్న ఊసరవెల్లి డొమినికన్ రిపబ్లిక్ సముద్ర తీరంలోపల కరేబియన్ దీవిలో అది తొలుత కనుగొనబడింది. అది అతిచిన్న ఊసరవెల్లి మాత్రమే కాదు. 23,000 భిన్న జాతుల పాకుడు జంతువులు, పక్షులు, క్షీరదాలలో కెల్లా అదే చిన్నది.





Untitled Document
Advertisements