మార్చ్ 1న మార్కెట్లోకి వివో వీ27.. గూగుల్ పిక్సల్ కు పోటీగా

     Written by : smtv Desk | Mon, Feb 20, 2023, 02:31 PM

మార్చ్ 1న మార్కెట్లోకి  వివో వీ27.. గూగుల్ పిక్సల్ కు పోటీగా

పోటి ప్రపంచంలో నిలదొక్కుకోవాలి అంటే ఎప్పటికపుడు కొత్తకొత్త ఆలోచనలతో దూసుకెళ్ళాలి. తాజగా ప్రముఖ స్మార్ట్ ఫోన్ సంస్థ వివో నుండి మరొక కొత్త ఫోన్ అందుబాటులోకి వస్తుంది. వివో వీ27 5జీ స్మార్ట్ ఫోన్ మార్చి 1న విడుదల కాబోతోంది. గూగుల్ పిక్సల్ 6కు ఇది గట్టి పోటీ ఇవ్వనుంది. మార్చి 1న విడుదల చేయనున్నట్టు వివో ధ్రువీకరించింది. దీనికి సంబంధించి తన ట్విట్టర్ పేజీలోనూ ప్రకటనలు ప్రదర్శిస్తోంది. ప్రస్తుతం రూ.30వేల శ్రేణిలో మంచి కెమెరా ఫోన్ గా గూగుల్ పిక్సల్ 6 స్థానం దక్కించుకుంది. దీనికి వివో 27 పోటీనిస్తుందా? లేదా అన్నది విడుదల తర్వాతే తెలియనుంది.

ప్రస్తుతం గూగుల్ పిక్సల్ 6ఏ ధర రూ.29,999 నుంచి మొదలవుతుంటే, వివో వీ27 ధర ఇంతకులోపు ఉండొచ్చని తెలుస్తోంది. వివో వీ27 ప్రీమియం డిజైన్ తో రానుంది. ఫొటోలు చూస్తే ఇదే తెలుస్తోంది. కర్వ్ డ్ డిస్ ప్లే, పంచ్ హోల్, స్లిమ్ డిజైన్ తో ఉండనుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7200 ఎస్ వోసీ ఉంటుందని అంచనా వేస్తున్నారు. వివో ఇంకా ధరలు, స్పెసికేషన్ల గురించి ప్రకటించలేదు. ప్రస్తుతం మన మార్కెట్లో వివో వీ25 అందుబాటులో ఉండగా, దీని ఆరంభ ధర రూ.27,999గా ఉంది. వీ27 ధర దీనికంటే ఎక్కువే ఉండే అవకాశాలున్నాయి.





Untitled Document
Advertisements