భారీగా పెరుగుతున్న బంగారం ధరలు.. ఇంకా పెరిగేనా? తగ్గేనా?

     Written by : smtv Desk | Mon, Feb 20, 2023, 03:24 PM

భారీగా పెరుగుతున్న బంగారం ధరలు.. ఇంకా పెరిగేనా? తగ్గేనా?

బంగారం అంటే ఆడవాళ్ళకి అమితమైన ప్రేమ. ప్రతి స్త్రీ కచ్చితంగా తమాకు ఉన్నంతలో కొద్దుగోప్పో బంగారం కొనుక్కోవాలి అని ఆశపడుతుంది. అందుకు అనుగుణంగా ప్రతిరుపాయి పోగేసి తమకు నచ్చిన వస్తువులు కొనుక్కుంటుంది. కనీ ప్రస్తుతం పెరుగుతున్న బంగారం ధరలు చూస్తుంటే ఆ అవకాశం లేనట్టే అనిపిస్తుంది. బంగారం ధర 2022 అక్టోబర్ నుంచి చూస్తే, దేశీయంగా 10 గ్రాములకు 16 శాతం పెరిగి రూ.50,760 నుంచి రూ.58,800కు చేరుకుంది. దీనివల్ల బంగారంలో పెట్టుబడుల పట్ల మళ్లీ ఆసక్తి నెలకొంది. మరి ఈ ఏడాది బంగారం ఇంకా పెరుగుతుందా?
అంతర్జాతీయంగా ద్రవ్యోల్బణం గరిష్ఠ స్థాయుల్లోనే ఉంది. ఆర్థిక సంక్షోభాలు, అనిశ్చితుల సమయాల్లో బంగారాన్ని రక్షణ సాధనంగా చూస్తుంటారు. దీంతో కరోనా మహమ్మారి సమయంలో బంగారం ర్యాలీని చూశాం, ఆ తర్వాత కొంత తగ్గిన బంగారం ధరలు మళ్లీ ఇటీవల గరిష్ఠ స్థాయులకు చేరాయి. గతేడాది మార్చి నాటికి గరిష్ఠానికి చేరిన బంగారం ధరలు, అదే ఏడాది అక్టోబర్ నాటికి 22 శాతం తగ్గాయి. మధ్యలో రేట్లు తగ్గడానికి చైనాలో లాక్ డౌన్ లు, సెంట్రల్ బ్యాంకుల కఠినవైఖరి కారణమయ్యాయి. బంగారానికి అతిపెద్ద మార్కెట్లలో చైనా కూడా ఒకటి. అక్కడ లాక్ డౌన్ లతో ఆభరణాల డిమాండ్ తగ్గింది. కానీ, ఇప్పుడు చైనా లాక్ డౌన్ లు ఎత్తివేసింది.
ఒకవైపు చైనా మార్కెట్ తిరిగి తెరుచుకోవడం, అమెరికాలో ద్రవ్యోల్బణం ఇక పెరగదన్న అంచనాలు, దీంతో వడ్డీ రేట్లు ఇకమీదట పెద్దగా పెరగకపోవచ్చన్న అంచనాలు, సెంట్రల్ బ్యాంకుల కొనుగోళ్లు బంగారం ధరలను ఇక మీదట నడిపించనున్నాయి. మొత్తానికి బంగారం ధరలు మరికొంత పెరగొచ్చని నిపుణులు భావిస్తున్నారు. అయితే, ధరల పరంగా ఎంతో అనిశ్చితి నెలకొందని క్వాంటం ఏఎంసీ సీఐవో చిరాగ్ మెహతా అంటున్నారు. ఒక్కసారి ఫెడ్ రేట్ల పెంపు ముగింపునకు చేరితే (2023 మధ్య నాటికి) బంగారం ధరలపై సానుకూల ప్రభావం కనిపిస్తుందని భావిస్తున్నారు. అంతర్జాతీయంగా ఆర్థిక వ్యవస్థలు ఇప్పటికిప్పుడు రికవరీ కాకపోవచ్చన్న అంచనా మరికొందరిలో ఉంది. ఇది కూడా బంగారం ధరలకు మద్దతునిచ్చేదే. కనుక బంగారాన్ని దీర్ఘకాల పెట్టుబడుల కోసం తీసుకోవచ్చన్నది నిపుణుల సూచన.





Untitled Document
Advertisements