చిన్నమొత్తాల పొదుపు.. రోజుకు రూ.30 చొప్పున ఇన్వెస్ట్ చేస్తే చేతికి 5 లక్షలు అందుతుంది

     Written by : smtv Desk | Thu, May 02, 2024, 04:17 PM

చిన్నమొత్తాల పొదుపు.. రోజుకు రూ.30 చొప్పున ఇన్వెస్ట్ చేస్తే చేతికి 5 లక్షలు అందుతుంది

పోస్టీఫీసులో అందుబాటులో ఉన్న చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో పీపీఎఫ్ మంచి రిటరైర్మెంట్ పథకంగా చెప్పవచ్చు. ఈ పథకం మెచ్యూరిటీ టెన్యూర్ 15 ఏళ్లుగా ఉంటుంది. ఆ తర్వాత 5 ఏళ్ల చొప్పున పెంచుకుంటూ వెళ్లవచ్చు. అలాగే ఈ పథకంలో ప్రస్తుతం 7.1 శాతం మేర వడ్డీ కల్పిస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఏప్రిల్- జూన్ త్రైమాసికానికి వడ్డీ రేట్లను ఇటీవలే ప్రకటించింది. అలాగే ప్రతి మూడు నెలలకు ఒకసారి ఈ పథకాల వడ్డీ రేట్లను సమీక్షిస్తుంది. కొన్నిసార్లు స్థిరంగా ఉంచవచ్చు. కొన్నిసార్లు పెంచడం లేదా తగ్గించడం చేయవచ్చు. ప్రస్తుతం పరిస్థితుల్లో మరింత పెంచే అవకాశం ఉన్నట్లు ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. మరోవైపు.. ఈ పథకంలో పెట్టుబడి పెట్టడం ద్వారా ఇన్‌కమ్ ట్యాక్స్ చట్టం 1961లోని సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపులూ పొందవచ్చు. వార్షికంగా రూ.1.5 లక్షల వరకు పన్ను మినహాయింపులు క్లెయిమ్ చేయవచ్చు. అలాగే వడ్డీ, విత్ డ్రా చేసుకునే మొత్తంపై ఎలాంటి ట్యాక్స్ ఉండదు. మీరు గరిష్ఠంగా రూ.1.5 లక్షల వరకు ఇందులో ఇన్వెస్ట్ చేసేందుకు అవకాశం ఉంటుంది.

ప్రస్తుతం పీపీఎఫ్ స్కీమ్‌లో వడ్డీ రేటు 7.1 శాతంగా ఉంది. ఇందులో మీరు వార్షికంగా రూ.10 వేలు పెట్టుబడి పెట్టారు అనుకుందాం. మీరు పెట్టుబడి పెట్టే మొత్తం రూ.2 లక్షలు అవుతుంది. మీరు 15 ఏళ్ల మెచ్యూరిటీ తర్వాత మరో 5 ఏళ్ల పాటు అంటే 20 ఏళ్ల పాటు పెట్టుబడి పెడుతూ ఉంటే దానిపై వడ్డీ రూ.2.43 లక్షల వరకు అందుతుంది. మొత్తంగా మీ చేతికి రూ.4.50 లక్షలు అందుతుంది. మీరు ఏడాదికి రూ.10 వేలు అంటే రోజుకు రూ.27 మాత్రమే పడుతుంది. అదే మీరు రోజుకు రూ.30 చొప్పున ఇన్వెస్ట్ చేసినట్లయితే.. నెలకు రూ.1000 అవుతుంది. అంటే ఏడాదికు రుూ.12000 పెట్టుబడి పెట్టాలి. అప్పుడు మీకు 20 ఏళ్ల మెచ్యూరిటీ తర్వాత మీ చేతికి రూ.5.3 లక్షలు అందుతాయి. ఇక్కడ మీరు ఇన్వెస్ట్ చేసే మొత్తం రూ.2.40 లక్షలు కాగా.. దానిపై వడ్డీ రూ.2.92 లక్షలు అవుతుంది. దీంతో మీ చేతికి రూ.5,32,660 వరకు అందుతుంది.





Untitled Document
Advertisements