బంగారం కొనాలి అనుకునేవారికి శుభవార్త.. !

     Written by : smtv Desk | Fri, May 03, 2024, 12:22 PM

బంగారం కొనాలి అనుకునేవారికి శుభవార్త.. !

గతకొన్ని రోజులుగా బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. పెరిగిన ధరలు సామాన్యులకు భారంగా మారాయి. పెరిగిన ధరల నుండి ఉపశమనం కలిగేలా హైదరాబాద్‌లో నేడు బంగారం ధరలు భారీగా తగ్గాయి. 10 గ్రాముల 22 కేరెట్ల బంగారం ధర రూ. 500 తగ్గి రూ. 65,750కి పడిపోగా, 24 కేరెట్ల స్వచ్ఛమైన పసిడి ధర రూ. 10 గ్రాములకు రూ. 540 క్షీణించి రూ. 71,730కి పడిపోయింది. వెండి ధర హైదరాబాద్‌లో కిలో రూ. 87 వేలుగా నమోదైంది.

అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు ఊగిసలాడుతున్నాయి. పెళ్లిళ్ల సీజన్ కారణంగా కొన్ని వారాలుగా మార్కెట్లో పుత్తడి ధరలు తగ్గుతూ వస్తున్నాయి. 24 కేరెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 60 వేలు, 22 కేరెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 55 వేలకు అటూఇటూగా కదలాడాయి. ఆ తర్వాత మళ్లీ పుంజుకున్నాయి. కాగా, ప్రస్తుతం పేర్కొన్న బంగారం ధరలు ఈ ఉదయం 8 గంటలకు నమోదైనవి మాత్రమే. ఆ తర్వాత వీటి ధరలలో మార్పు ఉండే అవకాశం ఉంది.





Untitled Document
Advertisements