ప్రమాదం నుండి త్రుటిలోబయటపడిన శివసేన (యూబీటీ) నేత.. ల్యాండ్ అవుతూ కుప్పకూలిన హెలికాప్టర్ వీడియో!

     Written by : smtv Desk | Fri, May 03, 2024, 01:37 PM

ప్రమాదం నుండి త్రుటిలోబయటపడిన  శివసేన (యూబీటీ) నేత..  ల్యాండ్ అవుతూ కుప్పకూలిన హెలికాప్టర్ వీడియో!

ప్రమాదం అనేది ఏ వైపు నుండి ఎలాంటి సమయంలో ఎదురవుతుందో ఎవరు ఊహించలేరు. తాజగా శివసేన (యూబీటీ) నాయకురాలు సుష్మా అందారే త్రుటిలో పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఆమెను ఎక్కించుకునేందుకు వచ్చిన హెలికాప్టర్ ల్యాండ్ అవుతూ కుప్పకూలింది. మహారాష్ట్రలోని రాయ్‌గఢ్ జిల్లా మహద్‌లో ఈ ఉదయం 9.30 గంటల ప్రాంతంలో జరిగిందీ ఘటన. ఎన్నికల ప్రచారం కోసం బయలుదేరిన సుష్మ హెలికాప్టర్ కోసం వేచి చూస్తుండగా, ల్యాండ్ అవుతూ అది ఆమె కళ్ల ముందే కుప్పకూలింది. అంతకుముందు అది అదుపు తప్పి గాల్లో ఓ వైపుకు కొట్టుకుపోవడం వీడియోలో స్పష్టంగా కనిపించింది.

హెలికాప్టర్ పైలట్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనలో హెలికాప్టర్ రూటర్ బ్లేడ్లు దెబ్బతిన్నాయి. హెలికాప్టర్ ల్యాండ్‌ సైట్‌కు చేరుకున్న తర్వాత ఒక్కసారిగా అదుపుతప్పి గాల్లో పక్కకు జారుకుంది. ఆపై ల్యాండ్ అవుతూ భూమిని ఢీకొట్టడంతో దుమ్ముధూళి ఒక్కసారిగా కమ్మేసింది.
https://twitter.com/IndianExpress/status/1786280108224835935?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1786280108224835935%7Ctwgr%5Ec3ec33d21926c876bf597579e0ca7758cc053a3d%7Ctwcon%5Es1_c10ref_url=https%3A%2F%2Fwww.ap7am.com%2Ftn%2F800601%2Fhelicopter-crashes-in-raigad-shiv-sena-ubt-leader-sushma-andhare-escapped






Untitled Document
Advertisements