నాగాస్త్రం శివుడి మెడలోకి ఎలా చేరింది?

     Written by : smtv Desk | Wed, Feb 08, 2023, 04:38 PM

 నాగాస్త్రం శివుడి మెడలోకి ఎలా చేరింది?

నాగాస్త్రం ఇది ఓ వినాశకర అస్త్రం. ప్రాచీన కాలంలో గొప్ప శక్తివంతుడు నీచుడైన నాగు అనే రాక్షసుడుండేవాడు. బ్రహ్మ తన తంత్ర విద్యతో యజ్ఞగుండం నుండి నాగపాశమనే శక్తిని సృష్టించాడు. దాన్ని 'నాగు' పైకి పంపాడు. త్రిమూర్తులు కూడా ఆ అస్త్రాన్ని అనుసరిస్తూ వెళ్ళారు. అతడు 'నాగు' నగరానికి (నాగలోకానికి) వెళ్లి కోటఎక్కి పెద్దగా శబ్దం చేయగా గర్భవతులైన నాగులకు గర్భస్రావమయ్యింది. ఎంతో మంది నాగుల పిల్లలు చనిపోయారు. నాగు సేనాని వీర సేనుడు ఈ నాగశక్తిని చంపడానికి రాగా నాగశక్తి మరో అరుపు అరిచింది. ఆ అరుపుకు వీరసేనుడు అతని సైన్యం ఎగిరిపడి బూడి దయ్యారు. 'నాగు' కోపోద్రిక్తుడై కోట్లాది సైన్యంతో అతనిపైకి యుద్ధానికి రాగా, నాగశక్తి ఆ సైన్యాన్ని నాశనం చేసి 'నాగా'ను మ్రింగివేసి త్రిమూర్తులకు వందనం చేసింది. శివుడు ఎంతో ఉత్సాహంతో నాగాస్త్రాన్ని తన మెడలో ధరించాడు. ఒకసారి ఇతడు లోకాలు చుట్టి వస్తానని కోరగా సాల్మల ద్వీపం మాత్రం వెళ్లకు తక్కిన లోకా లన్నీ చూసి రమ్మన్నాడు. అతడు అన్నీ తిరిగి వచ్చేదారిలో సాల్మల ద్వీపం వెళ్లగా అక్కడున్న నాగులు ఇతడిని చూసి ఏ మాత్రం భయపడలేదు. ఇతడాశ్చర్యపోయి కోపంతో చూడగా మాకు అత్యంత శక్తివంతుడైన శత్రు వున్నాడు. అతడితో మేము సంధిచేసుకొని రోజుకొకరం ఆహారమవుతాం. నీవంతకంటే వీరుడివయితే అతన్ని జయించమంటాయి. అలా జయిస్తే నిన్ను మారాజుగా అంగీకరిస్తామని చెప్తాయి. నాగుల శక్తి వంతుడైన శత్రువు గరుడుడు. అతడు రాగానే నాగులన్నీ పారిపోగా నాగపాశుడు మాత్రం కదలక అలాగే నిలబడ్డాడు. చివరకు గరుడునితో గెలవలేక పారిపోయి శివుని వద్దకు చేరాడు. గరుడుడు వెంటపడి శివుడ్ని తన ఆహారం తనకు దక్కనివ్వమనగా ఇకముందెప్పుడైనా నీకు సంబంధించిన వారి జోలికి వస్తే అలాగే తిను ప్రస్తుతానికి వది లెయ్యమని చెప్పాడు. అప్పటి నుండి నాగపాశుడు కైలాసం లోనే గడుపు తాడు. అతడే నాగాస్త్రం లేక నాగపాశంగా మారాడు.





Untitled Document
Advertisements