మేడిగడ్డ ప్రాజెక్టు రక్షణ పనులు ప్రారంభం..

     Written by : smtv Desk | Sat, May 18, 2024, 12:06 PM

మేడిగడ్డ ప్రాజెక్టు రక్షణ పనులు ప్రారంభం..

తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మేడిగడ్డ ప్రాజెక్ట్ ఘటన తెలంగాణ రాజకీయాలలో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఆ తరువాత కొద్దిరోజులకు ఈ వివాదం సద్దుమనిగినప్పటికి అడపాదడప కాంగ్రెస్ నాయకులు ఈ విషయం పై మాట్లాడుతూనే ఉన్నారు. తాజాగా మేడిగడ్డ ప్రాజెక్టు రక్షణ పనులు ప్రారంభమయ్యాయి. వర్షాకాలంలో బరాజ్ వద్ద చేపట్టాల్సిన రక్షణ చర్యలపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణుల కమిటీ చేసిన సిఫారసుల మేరకు ఎల్ అండ్ టీ పనులను ప్రారంభించింది. వరద ప్రవాహాలకు అడ్డంకులు లేకుండా చూడాలని, గేట్లను తెరిచి ఉంచాలని, ప్రవాహానికి ఆటంకం కలిగించే ఇసుకమేటలు, రాళ్లను తొలగించాలని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచించింది. డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచనల మేరకు వెంటనే పనులను చేపట్టాలని ఎల్ అండ్ టీ సంస్థకు ఇరిగేషన్ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో మేడిగడ్డ బ్లాక్-7లోని 8 గేట్లను ఎత్తివేసేందుకు పనులు ప్రారంభమయ్యాయి.

8 గేట్లలో ఒక గేటును ఇప్పటికే ఎత్తి పెట్టారు. 2 గేట్లు మినహా మిగిలిన గేట్లను సాంకేతిక ఇబ్బందులు లేకుండానే ఎత్తే అవకాశం ఉందని ఎల్ అండ్ టీ అధికారులు తెలిపారు. పగుళ్లు ఏర్పడిన 20వ పిల్లర్, దాని పక్కన ఉన్న పిల్లర్ గేట్లను ఎత్తడంలోనే జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉందని వారు అభిప్రాయపడుతున్నారు.





Untitled Document
Advertisements