నా భర్తది ఆత్మహత్య కాదు..

     Written by : smtv Desk | Tue, May 15, 2018, 03:45 PM

నా భర్తది ఆత్మహత్య కాదు..

ముంబై, మే 15 : ప్రముఖ బాలీవుడ్ నటుడు ఇందర్‌ కుమార్‌ ఆత్మహత్య చేసుకోలేదని తన భార్య పల్లవి స్పష్టం చేశారు. గత కొద్ది రోజులుగా తన భర్త ఇందర్‌ కుమార్‌ మద్యం సేవిస్తుండగా రికార్డైన వీడియో వైరల్‌ అవుతోంది.

ఈ వీడియోలో.. "నాకున్న చెడు వ్యసనాలు నా జీవితాన్ని నాశనం చేశాయి. హీరో అవ్వాలని ముంబయి వచ్చాను. కానీ అవకాశాల కోసం ఎన్నో తప్పులు చేశాను. ఇందుకు నా తల్లిదండ్రులను క్షమించమని అడుగుతున్నాను. నేను ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నాను" అని ఏడుస్తూ వెల్లడించారు.

దీంతో ఇందర్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడ౦టూ రూమర్స్ వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇందర్ భార్య పల్లవి మీడియాతో మాట్లాడారు. నా భర్త ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదు. ఈ వీడియో తను నటించిన 'ఫటీ పడి హై' చిత్రంలోనిది" అంటూ తెలిపింది. అ౦తేకకుండా ఆ చిత్ర దర్శకుడు కూడా స్పందిస్తూ.. తను గుండెపోటుతోనే మరణించినట్లు పేర్కొన్నాడు.

Untitled Document
Advertisements