గుండె రక్తనాళాల్లో కొవ్వు తగ్గేందుకు ఆయుర్వేదంలోని ఈ 4 మూలికలు బెస్ట్!

     Written by : smtv Desk | Mon, May 06, 2024, 03:48 PM

గుండె రక్తనాళాల్లో కొవ్వు తగ్గేందుకు ఆయుర్వేదంలోని ఈ 4 మూలికలు బెస్ట్!

ప్రస్తుతకాలంలో వయసుతో సంబంధం లేకుండా గుండె జబ్బులతో మరణిస్తున్న వారి సంఖ్య నానాటికి పెరిగిపోతూనే ఉంది. అసలు గుండె సమస్యలకు కారణాలు ఏంటి అంటే? మారిన జీవన శైలీ, ఆహారపు అలవాట్లు, పనివేళలు, మానసిక ఒత్తిడి, వర్కౌట్ చేయకపోవడం, సరిలేని లైఫ్‌స్టైల్ ఇలా అనేక కారణాల వలన గుండె సమస్యల బారిన పడుతున్నారు. అయితే ఈ సమస్యలను దూరం చేసుకోవాలంటే చాలా జాగ్రత్తలు పాటించాలి.

అయితే, ఆయుర్వేదంలో ఎన్నో అద్భుత మూలికలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మన ఆరోగ్యాన్ని కాపాడతాయి. సరైన డైట్, లైఫ్‌స్టైల్ చేంజెస్ చేయడంతో పాటు ఈ మూలికల్ని తీసుకుంటే ఇమ్యూనిటీ పెరిగి గుండె సమస్యలు కూడా దూరమవుతాయి. మరి ఆ మూలికలు ఏంటో తెలుసుకోండి.

గుగ్గుల్.. గుగ్గుల్ అనేది ఆయుర్వేదంలో ముఖ్య మూలిక. ఇందులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండె ధమనులని ఆరోగ్యంగా ఉంచుతాయి. గుండె రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడకుండా ఈ మూలిక కాపాడుతుంది.

వెల్లుల్లి.. వంటల్లో ఎక్కువగా వాడే వెల్లుల్లిలోనూ ఎన్నో అద్భుత గుణాలు ఉన్నాయి. ఇది గుండె ఆరోగ్యానికి చాలా మంచిదని చెప్పొచ్చు. ఆయుర్వేదంలో వెల్లుల్లిని గుండె ఆరోగ్యాన్ని కాపాడే మూలిక అని చెప్పొచ్చు. ఇది గుండె కండరాలను బలంగా చేసి రక్తపోటుని బ్యాలెన్స్ చేస్తుంది. అంతేకాకుండా గుండె రక్త నాళాల్లో కొవ్వు నిల్వలని తగ్గిస్తుంది.

అర్జున చెట్టు.. ఈ అర్జున చెట్టునే టెర్మినలియా అర్జున చెట్టు అంటారు. ఆయుర్వేదంలో దీనికి ఎన్నో అద్భుతగుణాలు ఉన్నాయి. దీనిని వాడడం వల్ల రక్తపోటు కంట్రోల్ అవుతుంది. గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ చెట్టు బెరడుని పొడి చేసి ఆవు పాలు, తేనెతో కలిపి తింటారు. ఇది నరాలను కూడా బలంగా చేస్తుంది.

పసుపు.. పసుపులో ఎన్నో అద్భుత గుణాలు ఉన్నాయి. ఇది అందం దగ్గర్నుంచి ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది. ఇండియన్ కిచెన్‌లో ఎక్కువగా వాడే ఈ పసుపులో కర్కుమిన్‌తో పాటు పవర్‌ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉన్నాయి.





Untitled Document
Advertisements