వేసవి సెలవులకు ఊటీ, కొడైకెనాల్ వెళ్ళాలి అనుకుంటున్నారా? ఈ విషయాల గురించి తెలుసుకోండి !

     Written by : smtv Desk | Tue, May 07, 2024, 11:31 AM

వేసవి సెలవులకు ఊటీ, కొడైకెనాల్ వెళ్ళాలి అనుకుంటున్నారా? ఈ విషయాల గురించి తెలుసుకోండి !

వేసవికాలం రాగానే మండే ఎండల నుండి సేద తీరేందుకు చల్లది వాతావరణం ఉండే ప్లేస్ లు వెతుక్కుంటూ వెళతారు. అలా వెళ్ళే ప్లేసెస్ లో మొదటగా వినిపించేది ఊటీ, కొడైకెనాల్. అయితే మ‌ద్రాసు హైకోర్టు ఆదేశాల మేర‌కు వేస‌వి విడిది కేంద్రాలైన‌ ఊటీ, కొడైకెనాల్ వెళ్లేవారికి ఈ నెల‌ 7వ తేదీ నుంచి ఈ-పాస్ త‌ప్ప‌నిస‌రి అంటూ ఇప్ప‌టికే త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేష‌న్ ప్ర‌క్రియ సోమ‌వారం ఉద‌యం 6 గంట‌ల‌కు ప్రారంభ‌మైంది. ప‌ర్యాట‌కులు త‌మ వివ‌రాలు, వాహ‌నాల నంబ‌రు, వ‌చ్చే రోజు, బ‌స చేసే రోజులు, బ‌స చేసే చోటు వంటి వివ‌రాల‌ను ఆన్‌లైన్ ద్వారా వెల్ల‌డించి ఈ-పాస్ పొందాల్సి ఉంటుంది.

ఇక‌పై ఊటీ, కొడైకెనాల్ వెళ్లే టూరిస్టులు, వ్యాపారులు epass.tnega.org వెబ్‌సైట్‌లో త‌మ వివ‌రాల‌ను న‌మోదు చేసి ఈ-పాస్ పొంద‌వ‌చ్చు. కాగా, వాహ‌న ర‌ద్దీని క్ర‌మ‌బ‌ద్ధీక‌రించ‌డానికే ఈ విధానం అమ‌లు చేసిన‌ట్టు త‌మిళ‌నాడు స‌ర్కార్ వెల్ల‌డించింది. ఇక ఈ విధానం జూన్ 30వ తేదీ వ‌ర‌కు మాత్ర‌మే అమ‌లులో ఉంటుంద‌ని, దీనివ‌ల్ల‌ ప‌ర్యాట‌కుల‌కు ఎలాంటి ఇబ్బంది ఉండ‌ద‌ని తెలిపింది.





Untitled Document
Advertisements